స్నాప్‌చాట్‌లోకి కొత్త ఫీచర్, ఒకేసారి 16 మందితో వీడియో చాట్

Written By:

ప్రముఖ సోషల్ యాప్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ వారంలోనే అనేక రకాలైన కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇకపై ఈ యాప్‌లో యూజర్లు గ్రూప్ వీడియో చాట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒకేసారి 16 మంది వీడియో చాటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక గ్రూప్‌లో ఉన్న యూజర్ మొదటగా గ్రూప్ చాట్‌లో వీడియో కెమెరా ఐకాన్‌ను టచ్ చేస్తే చాలు. దాంతో ఆ గ్రూప్‌లో ఉన్న వారందరికీ వీడియో చాట్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఈ క్రమంలో నోటిఫికేషన్ చూసిన యూజర్లు ఆ గ్రూప్‌లో వీడియో చాటింగ్‌లో జాయిన్ అవచ్చు.

నోకియా నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ధర, ఫీచర్లు ఇవే !

స్నాప్‌చాట్‌లోకి కొత్త ఫీచర్, ఒకేసారి 16 మందితో వీడియో చాట్

అలా ఒకేసారి 16 మంది వరకు గ్రూప్ వీడియో చాటింగ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే 32 మంది వరకు గ్రూప్ ఆడియో చాట్ కూడా చేసుకునే వీలు కల్పించారు.కాగా 2016లో ఈ ఫీచర్ ని స్నాప్ ప్రవేశపెట్టింది. అప్పటినుండి కొన్ని మిల్లియన్ మంది స్నాప్ కాల్స్ ఉపయోగిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే కెమెరాని ఇందులో మీరు ఉపయోగించుకోనవసరం లేకుండా కూడా చాట్ చేసుకోవచ్చు. కేవలం వాయిస్ ద్వారా కూడా ఆ గ్రూపులో జాయిన్ కావచ్చు.

అలాగే కొత్తగా మరో ఫీచర్ టాగ్ ఆప్సన్ ప్రవేశపెట్టింది. మీరు పోస్ట్ చేసిన ఏదైనా విషయాన్ని మీ స్నేహితులకు టాగ్ చేయవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా "@," అని టైప్ చేసి ఎవరికైతే టాగ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ పేరు టైప్ చేసి టాగ్ ఒకే చేస్తే అతనికి చేరుతుంది. ఆ టాగ్ చేసిన వ్యక్తికి నోటిఫికేషన్ బార్ లో ఏం స్టోరీ టాగ్ చేశారనేది తెలుస్తుంది. ఫేస్ బుక్ లో ఉన్న ఫీచర్లనే స్నాప్ చాట్ కూడా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ టాగ్ ద్వారా మీరు కంపెనీని కాని అలాగే బ్రాండ్ కాని ప్రమోట్ చేసుకోవచ్చని స్నాప్ తెలిపింది.

English summary
Snapchat introduces group video chat and friend tagging in Stories More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot