రజనీకాంత్ రాజకీయ వార్త ఆలస్యం, వాట్సప్ డౌన్, అసలు న్యూస్ ఏంటంటే..?

Written By:

కొత్త ఏడాదిలోకి అందరూ అడుగుపెట్టిన తొలి గంటలోనే యూజర్లకి వాట్సప్ నిరాశను మిగిల్చింది. దాదాపు రెండు గంటల పాటు ప్రముఖ మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సప్‌ క్రాష్‌డౌన్‌ అయింది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు సునామిలా పోటెత్తడంతో యాప్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయిన వాట్సప్‌ సేవలు మళ్లీ పునరుద్ధరణ అయ్యాయి. ఈ విషయాన్ని పసిగట్టిన యూజర్లు దీనిపై ట్విట్టర్లో భారీ ఎత్తున ఛలోక్తులు విసిరారు.

13 ఎంపీ కెమెరాతో Eluga Ray 500, రెడ్‌మి నోట్ 4కి సవాల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఛలోక్తి 1

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించే వార్త, వాట్సప్‌కు చాలా ఆలస్యంగా చేరినట్టు ఉంది. అందుకే డౌన్ అయిందంటూ మరో ఛలోక్తిని విసిరారు.

ఛలోక్తి 2

2018లో ఉగ్రవాదం, పేదరికం, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటివి చాలా ఎదుర్కోవాలి కానీ 2018 మొదటి విషయం వాట్సప్‌ డౌన్‌ అవడం. ఇది చాలా గొప్ప ప్రారంభమంటూ మరో ఛలోక్తిని విసిరారు.

ఛలోక్తి 3

వాట్సప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌, రీఇన్‌స్టాల్‌ చేస్తున్న ప్రజలందరూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని మరొకరు ట్వీట్ చేశారు.

ఛలోక్తి 4

ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయని లెజెండ్స్‌ అందరికీ వాట్సప్‌ డౌన్‌ అయిందని ఒకరు ట్వీట్ చేశారు.

ఛలోక్తి 5

మరో ఆసక్తికర ఛలోక్తి 

ఛలోక్తి 6

వాట్సప్ డౌన్ అంటూ ఎవరో ఆందోళన చేస్తున్నారట

ఛలోక్తి 7

మీ నోటిఫికేషన్ గురించి మరో ఛలోక్తి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Social Humour: While WhatsApp was down, these jokes went up more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot