4 లక్షల ఫాలోవర్లతో సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్న FB ముద్దుగుమ్మ
తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణీ, నొదుటిన బొట్టు. చేతికి గోరింటాకు పెట్టుకుని ఓ రోజు ఫేస్‌బుక్ లో ప్రత్యక్షమైంది ఓ అమ్మాయి.
తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణీ, నొదుటిన బొట్టు. చేతికి గోరింటాకు పెట్టుకుని ఓ రోజు ఫేస్‌బుక్ లో ప్రత్యక్షమైంది ఓ అమ్మాయి. అంతే ఆ రోజు నుంచి ఫేస్‌బుక్ లో ఆమె పేజీకి లక్షల కొద్దీ వ్యూస్ వేల కొద్ది షేర్స్. తను పెద్ద సెలబ్రిటీ కూడా కాదు అయన కూడా ఫేస్‌బుక్ లో తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. స్టోరీ పూర్తి వివరాల్లోకెళితే.. దిల్‌సుఖ్‌నగర్‌లోని మధురాపురీ కాలనీకి చెందిన దివ్య అన్వేషిత అసలు పేరు దివ్య కొమరాజు.చదివింది మ్యూజిక్ లో డిప్లొమా అయినా సమాజంలో జరుగుతున్న వాటిని ఫేస్‌బుక్ లో లైవ్ డిస్కషన్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటుంది. కరెంట్ ఇష్యూస్ మీద దివ్య జరిపే చర్చలు అందరినీ ఆలోజింపచేస్తాయి. ఇటీవలే '92.7 బిగ్ ఎఫ్‌ఎం' అమ్మాయిని డిజిటల్ రాక్‌స్టార్ అవార్డుతో సత్కరించింది.

ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు.....
ప్రతిరోజు ఫేస్‌బుక్ లైవ్ లోకి వచ్చే దివ్య తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. అలాగే వారి సమస్యలకు పరిష్కారాలు చెబుతోంది. దీంతో ఆమె చెప్పే సమాధానాల కోసం ఫేస్‌బుక్ లో లక్షల మంది వెయిట్ చేస్తుంటారు.

సమాజంలో జరిగే కొన్ని తీవ్ర సంఘటనలపై....
ఇవే కాకుండా అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని తీవ్ర సంఘటనలపై దివ్య ఫేస్‌బుక్ లైవ్ లో చర్చా కార్యక్రమం చేపడుతోంది. ఇటీవల దేశాన్ని కుదిపేసిన కథువా ఘటనపై దివ్య లైవ్ ఏకంగా నాలుగు గంటలు కొనసాగింది. ఓ అమ్మాయిగా తాను బయట ఎదుర్కొనే సమస్యలను సైతం ఆరోజు లైవ్‌లో వివరించింది.

కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు....
అంతేకాకుండా కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు యత్నించాడు .ఇంతలో దివ్య చెప్పిన మాటలు విని అతనికి జ్ఞానోదయం కలిగింది. దీంతో అతను ఆ బాధను మరచిపోయి హాయిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

యాడ్‌లో నాగార్జునతో కలిసి...
ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యాడ్‌లో యాంకర్‌గా దివ్య చేసింది. అందులో హీరో నాగార్జునతో కలిసి చేసే అవకాశం దక్కించుకుంది.

ప్రతిరోజు కనీసం రెండు లక్షలకు వ్యూస్.....
దివ్య లైవ్‌కు ప్రతిరోజు కనీసం రెండు లక్షలకు వ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘92.7 బిగ్ ఎఫ్‌ఎం' డిజిటల్ రాక్‌స్టార్ అవార్డుతో ఆమెను ఇటీవల సత్కరించింది.

గత రెండేళ్లలో....
గత రెండేళ్లలో ఈమె లైవ్‌లలో ఇప్పటివరకు 20-30 సార్లు 17లక్షలవ్యూస్ రాగా, 60-70సార్లు 5-7లక్షల వ్యూస్ ఉండడం గమనార్హం.

తన లక్ష్యం ....
ఏకదాటిగా 24గంటలు లైవ్ నిర్వహించి రికార్డు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ఆమె తెలిపింది.


Click it and Unblock the Notifications








