పసికందును ఉరివేసి చంపేసాడు, ఫేస్‌బుక్‌లో వీడియో హల్‌చల్

థాయ్‌ల్యాండ్ చెందని ఓ వ్యక్తి తన 11 నెలల పసికందును ఉరివేసి దారుణంగా హత్య చేసాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. ఆ తురువాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియా చెబుతోంది.

పసికందును ఉరివేసి చంపేసాడు, ఫేస్‌బుక్‌లో వీడియో హల్‌చల్

బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే దిగిపోతుందా..? 6 ముఖ్యమైన కారణాలు

చిన్నారి హత్యకు సంబంధించి తండ్రి అకౌంట్‌లో అప్‌లోడ్ అయిన రెండు వీడియో క్లిప్స్ సుమారు 24 గంటల పాటు హల్‌చల్ చేసాయి. ఆ తరువాత వాటిని ఫేస్‌బుక్ డిలీట్ చేసేసింది. భార్యతో తలెత్తిన కలహాలు కారణంగానే వుట్టిసాన్ వోంగ్‌టాలే తన కుమార్తెను కడతేర్చి తననితాను హతమార్చుకున్నట్లు బంధవులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామూహిక అత్యాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసారు..

ఇటీవల స్విడెన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ముగ్గురు యువకులు ఒక మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను వారు ఒక ఫేస్‌బుక్ గ్రూప్ పేజీలో కూడా లైవ్‌స్ట్రీమ్ చేసారు. ఈ ఘటన కూడా సోషల్ మీడియా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.

అతికిరాతకంగా చంపుతూ..

అమెరికాకు చెందిన ఓ నరరూప రాక్షసుడు ఓ వృద్ధుడ్ని అతికిరాతకంగా చంపుతూ ఆ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసాడు. అంతేకాకుండా, తాను పోలీసులకు పట్టబడేందుకు వరకు ఇలాంటి హత్యలు చేస్తూనే ఉంటానని హెచ్చరిక కూడా చేసాడు. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాను ఏవిధంగా వాడుకుంటున్నారో కూడా మనకు అర్థమవుతుంది.

రూ.10,000లో బెస్ట్ ప్రాసెసర్ ఫోన్‌లు ఇవే

మితిమీరిన సోషల్ మీడియా వినియోగం..

మితిమీరిన సోషల్ మీడియా వినియోగం మానవ బంధాలను తుంచేస్తోంది. ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తి ఒకరినొకరు చంపుకోటానికి సోషల్ మీడియా కారణమయ్యిందంటే, నేటి జీవితాల్లో సామాజిక మాధ్యమాలు ఏ మేరకు ప్రభావం చూపుతుందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రియురాలు పెడుతున్న పోస్ట్‌లకు మనస్థాపానికి గురై...

ఫేస్‌బుక్‌లో తన ప్రియురాలు పెడుతున్న పోస్ట్‌లకు మనస్థాపానికి గురైన ప్రియుడు అమెను హతమర్చాడు. కామెరియోలోని సెంట్రల్ మౌంటెన్ టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ దాకా జియో మొత్తం ప్లాన్స్ వివరాలు

తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్య చేసుకుంది...

ఫేస్‌బుక్ వినియోగించరాదని తల్లిదండ్రులు హుకం జారీచేయటంతో మనస్తాపానికి గురైన మహారాష్ట్రాకు చెందిన 17 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినందుకు 10 రోజులు జైలు

2007లో డైలాన్ ఒస్బోర్న్ అనే వ్యక్తి భార్య పై వేధింపులకు పాల్పడిన నేపధ్యంలో మేజిస్ట్రేట్ అతనిని మందలించి ఆమెతో మాట్లాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో డైలాన్ ఒస్బోర్న్ యాధృచికంగా తన భార్యకు ‘ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్' పెట్టాడు. ఈ చర్యకు భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించటంతో డైలాన్ ఒస్బోర్న్‌ను 10 రోజులు జైల్లో ఉంచారు.

రూ.5000కే జియో ల్యాపీ..

కన్నం వేసిన ఇంట్లోనే ఫేస్‌బుక్ ఓపెన్ చేసి..

జోనాథన్ జి.పార్కర్ అనే నేరస్థుడు, తాను నేరానికి పాల్పిన ఇంట్లోని వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగినై, లాగ్ అవుట్ చేయటం మర్చిపోయాడు. పోలీసులకు ఇదే పెద్ద ఆధారమై నేరస్థుడిని పట్టించింది.

జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్‌బుక్ పోస్ట్ చేసినందుకు

అమెరికాకు చెందిన వనీసా స్టార్ ఇంకా అలెగ్జాండర్ డేనియల్ దంపతులు జంతు సంరక్షణా చట్టాన్నిఉల్లంగిస్తూ జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్‌బుక్ పోస్ట్ చేసినందుకు గాను జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

మాజీ భర్తను ఉగ్రవాదిగా పోల్చినందుకు..

నైజీరియాకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి తన మాజీ భర్తను నైజీరియాకు చెందిన ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దింతో సదురు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

BSNL ఉచిత వై-ఫై సేవలు ప్రారంభం, హైదరాబాద్‌లో ఎక్కడెక్కడంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Thai Man Broadcasts Baby Daughter's Murder on Facebook Live. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot