సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లయన్ కింగ్ టీజర్
1994లో విడుదలై ఘనవిజయం సాధించిన 'ద లయన్ కింగ్' యానిమేషన్ ఫిల్మ్ చిత్రం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో తిరిగి తయారై 3డీ యానిమేషన్లో అదే పేరుతో విడుదలకు సిద్ధం.
1994లో విడుదలై ఘనవిజయం సాధించిన 'ద లయన్ కింగ్' యానిమేషన్ ఫిల్మ్ చిత్రం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో తిరిగి తయారై 3డీ యానిమేషన్లో అదే పేరుతో విడుదలకు సిద్ధం అవుతుండగా, దీని టీజర్ విడుదలై వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి జోన్ ఫావ్రే దర్శకత్వం వహిస్తున్నాడు....
భారీ బడ్జెట్ తో డిస్నీ నిర్మిస్తున్నఈ చిత్రానికి 'ది జంగిల్ బుక్' దర్శకుడు జోన్ ఫావ్రే దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్రోవార్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫప్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....
తాజాగా రిలీజ్ అయిన ద లయన్ కింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు జోన్ ఫావ్రే ట్వీట్ చేసిన టీజర్‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్, బ్యూటీ అండ్ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్ కింగ్ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు.

22 కోట్ల వ్యూస్ వచ్చాయి....
ఈ ఫిల్మ్ ట్రైలర్‌కి 24 గంటల్లోనే దాదాపు 22 కోట్ల వ్యూస్ వచ్చాయి. డిస్నీ సంస్థ రూపొందించిన చిత్రాలన్నింటిలో ఈ చిత్ర ట్రైలర్‌ని ఎక్కువ మంది వీక్షించడం విశేషమని ఆ సంస్థ తెలిపింది.

2019 జూలై 19న విడుదల కానుంది....
ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా వేసవి కానుకగా 2019 జూలై 19న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications