రూ.14 కోట్ల ప్యాకేజీ ఉద్యోగం, చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు

హెడ్ లైన్ చూడగానే షాక్ అయ్యారా..అయితే ఇది నిజమే. ఎకనామిక్స్ టైం కథనం ప్రకారం సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లో టాప్ పోస్టుకి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

|

హెడ్ లైన్ చూడగానే షాక్ అయ్యారా..అయితే ఇది నిజమే. ఎకనామిక్స్ టైం కథనం ప్రకారం సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లో టాప్ పోస్టుకి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ రెండింటికి కలిపి భారత్‌లో 57 కోట్లకు పైగానే యూజర్లు ఉన్నారు.అమెరికా కంటే భారత్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్‌లకు యూజర్లు ఎక్కువ. అయినప్పటికీఫేస్‌బుక్‌, వాట్సప్‌లకు భారత్‌లో అధినేతలు దొరకడం లేదు. దొరకడం లేదు కాదు అనడం కన్నా ఎవరూ ఈ పదవిని అలంకరించడానికి ముందుకు రావడం లేదట.

స్మార్ట్‌ఫోన్ వాడేవారు సాధారణంగా చేస్తున్న తప్పులుస్మార్ట్‌ఫోన్ వాడేవారు సాధారణంగా చేస్తున్న తప్పులు

రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలు

రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలు

వాట్సప్‌, ఫేస్‌బుక్‌లకు ఇటీవల భారత్‌లో ఆంక్షలు పెరిగిపోయాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ న్యూస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వార్తలతో బాగా మూకదాడులు జరుగుతున్నాయంటూ.. ప్రభుత్వం ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలే జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ కంపెనీలకు టాప్‌ ప్రతినిధులు దొరకడం లేదు.

ఉమాంగ్‌ బేడి

ఉమాంగ్‌ బేడి

ఫేస్‌బుక్‌ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉంటున్న ఉమాంగ్‌ బేడి 2017 అక్టోబర్‌లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.

సందీప్‌ భూషణ్‌

సందీప్‌ భూషణ్‌

ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెటింగ్‌ సొల్యుషన్స్‌ హెడ్‌ సందీప్‌ భూషణ్‌ ఆ పదవిని తాత్కాలికంగా అలకరించారు. కానీ కొత్త వారిని నియమించడం ఆ కంపెనీకి కష్టంగా మారింది.

 రూ.14 కోట్లకు పైగా పరిహారాలు

రూ.14 కోట్లకు పైగా పరిహారాలు

ఎండీ పదవి, వైస్‌-ప్రెసిడెంట్‌ పోస్ట్‌తో సమానం. అంటే స్టాక్‌ ఆప్షన్లతో కలిపి, వార్షికంగా రూ.14 కోట్లకు పైగా పరిహారాలు పొందుతారు. కానీ కోట్లు ఆఫర్‌ చేస్తున్న భారత్‌లో ఈ కంపెనీలకు ఎండీ పదవిని చేపట్టేందుకు ఏ సీనియర్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ ముందుకు రావడం లేదని తెలిసింది.

వీరి వైపు చూపు..

వీరి వైపు చూపు..

ఫేస్‌బుక్‌ ప్రస్తుతం స్టార్‌ ఇండియా ఎండీ సంజయ్‌ గుప్తా, టాటా స్కై ఎండీ హరిత్‌ నాగ్‌పాల్‌, హాట్‌స్టార్‌ సీఈవో అజిత్‌ మోహన్‌ల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఒకరిని ఖరారు చేయాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

వాట్సప్‌కు కూడా ..

వాట్సప్‌కు కూడా ..

దీంతో పాటు ఫేస్‌బుక్‌లో మొత్తంగా డజనుకు పైగా సీనియర్‌-లెవల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు వాట్సప్‌కు కూడా భారత్‌ హెడ్‌ను నియమించడం క్లిష్టంగా మారింది.

సుప్రీం కోర్టు నోటీసులు..

సుప్రీం కోర్టు నోటీసులు..

కాగా వాట్సప్‌ ఇప్పటి వరకు భారత్‌లో ఎందుకు గ్రీవియెన్స్‌ ఆఫీసర్‌ నియమించలేదో సమాచారం చెప్పాలంటూ ప్రభుత్వానికి, ఆ కంపెనీకి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.

Best Mobiles in India

English summary
Nobody wants to head Facebook, WhatsApp in India! Blame it on govt's prosecution threat more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X