అడిడాస్ నుంచి 700 జతల షూ ఉచితం, వాట్సప్ మెసేజ్ వచ్చిందా ?

By Gizbot Bureau
|

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా అందరూ వాట్సప్ కి బానిస అయిపోయారు. ఇక పండుగల సీజన్ వచ్చిందంటే ఆఫర్ల పేరుతో పలు రకాల ఫేక్ మెసెజ్‌లు వాట్సప్ లో చక్కర్లు కొడుతుంటాయి. యూజర్లు అవి ఫేక్ అని తెలియక వెంటనే వాటిని క్లిక్ చేసి మోసపోతుంటారు. ఇలాంటిదే ఓ మెసేజ్ ఈ మధ్య వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ షూస్ కంపెనీ ఆడిడాస్.. తన 93వ వార్షికోత్సవం సందర్భంగా.. రూ.5వేల విలువ చేసే షూస్‌ని ఆఫర్ చేస్తోందన్న మెసేజ్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్రీ షూస్ కావాలంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి అంటూ.. ఓ లింక్ మెసేజ్‌లో కనిపిస్తుంది. ఈ లింక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిలీట్ చేయండి
 

డిలీట్ చేయండి

అడిడాస్ కంపెనీ 70వ వార్షికోత్సవం సందర్భంగా 700 జతల షూస్, 7000 టీషర్ట్స్ ఉచితంగా ఇస్తోంది" అనే మెసేజ్ మీకు వాట్సప్‌లో వచ్చిందా? ఈ మెసేజ్‌ని మరో 15 మందికి పంపితే మరో గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్ అని ఉంటుందని కనిపిస్తోందా.. అయితే దాన్ని ఓపెన్ చేయకండి. దాన్ని వెంటనే డిలీట్ చేయడం మంచిది. ఆడిడాస్ కంపెనీ అసలు ఇలాంటి ఆఫర్లే ఇవ్వలేదు.

డూప్లికేట్ మెసేజ్‌

డూప్లికేట్ మెసేజ్‌

గతేడాది కూడా ఇలాంటి మెసేజ్ వైరల్ అయింది. రూ.3వేల విలువ చేసే షూస్‌ని ఆఫర్ చేస్తోందన్న మెసేజ్ వైరల్ అయింది. అయితే, ఓ ప్రముఖ వెబ్ సైట్ ఇలాంటి డూప్లికేట్ మెసేజ్‌లను తయారు చేస్తోంది. ఈ లింక్‌ను క్లిక్ చేసి.. వ్యక్తిగత వివరాలు ఫిల్ చేస్తే సరి ఇక మోసపోయినట్లే. వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటూ ఆ వెబ్ సైట్ సొమ్ము చేసుకుంటోంది.

పండుగ సమయాల్లో ఎక్కువ

పండుగ సమయాల్లో ఎక్కువ

దసరా పండుగ సందర్భంగా ఇలాంటి ఆఫర్ మెసేజ్‌లు మరీ ఎక్కువైపోయాయి. అమెజాన్ సేల్, ఫ్లిప్ కార్ట్ పేర్లతో కూడా మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సార్లు 99శాతం డిస్కౌంట్ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండండి.

జాగ్రత్తగా ఉండండి
 

జాగ్రత్తగా ఉండండి

గతంలో కూడా ఈ మెసేజ్ సర్క్యులేట్ అయింది. అయితే ఇప్పుడు నంబర్ మారింది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించొద్దు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి ఇలాంటి బహుమతులు ఇస్తామన్నా నమ్మొద్దు. మీ అకౌంట్ వివరాలు చెప్పొద్దు.

Most Read Articles
Best Mobiles in India

English summary
This major WhatsApp scam is back, don’t fall for it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X