ఇండియా అంటే ఇదే, ముంబై వరదలపై ఆనంద్ మహీంద్రా షాకింగ్ ట్వీట్ !

Written By:

దేశ రాజధాని ముంబై వరదలతో అట్టుకుడిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 288 మిల్లీమీటర్ల వర్షంతో ముంబై వీధులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. 1997 ఆగస్టు నుంచి ఇంత భారీ మొత్తంలో వర్షం కురియడం ఇదే మొదటిసారి. ఇంతటి పెను విపత్తులోనూ ప్రజలు ఒక్కరికొక్కరు సాయపడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఈ వరదలపై మహింద్రా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

మొబైల్ బిల్లులు భారీగా తగ్గుతున్నాయ్, ఎందుకంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీబీసీ ఇచ్చిన ఆర్టికల్ కు కౌంటర్ గా

బీబీసీ ఇచ్చిన ఆర్టికల్ కు కౌంటర్ గా మహీంద్రా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.

ముంబై ప్రజల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని..

''హోస్టన్‌ వరదలు: దొంగతనాలు, చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తూ రాత్రంతా కర్ఫ్యూ విధించారు'' అని బీబీసీ ఓ ఆర్టికల్‌ రాసింది. ముంబై ప్రజల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలుపుతూ బీబీసీ ఆర్టికల్‌కు కౌంటర్‌గా ఆనంద్‌ మహింద్రా ఈ ట్వీట్‌ చేశారు.

మురికివాడకు చెందిన ఓ వ్యక్తి

ఈ ట్వీట్‌లో తన స్నేహితుడు ఒకరు ఎయిర్‌పోర్టుకు కారులో వెళ్తూ 5 గంటల పాటు వరదల్లో చిక్కుకుపోయారని, మురికివాడకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని బయటికి తీసుకొచ్చి టీ, బిస్కెట్లు అందించినట్టు మహింద్రా ట్వీట్‌ చేశారు.

ట్విట్టరియన్ల నుంచి అనూహ్య స్పందన

భారత్‌లో మానవత్వం బతికే ఉందని తెలుపుతూ మహింద్రా చేసిన ఈ ట్వీట్‌కు ట్విట్టరియన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఒక్కరి కోసం అన్ని మతాల తలుపులు

ఒక్కరి కోసం అన్ని మతాల తలుపులు తెరుచుకుంటాయని, ఇదే భారత్‌ అంటూ ఓ ట్విట్టర్‌ పేర్కొన్నారు. అంతేకాక ప్రతికూల పరిస్థితుల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారని, ఎలాంటి దొంగతనాలు, చొరబాట్లు ఇక్కడ ఉండవన్నారు.

సిస్టమే సరిగా లేదని ఓ వ్యక్తి ట్వీట్‌

భారత్‌లో మంచి ప్రజలున్నారని, కానీ సిస్టమే సరిగా లేదని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. ఇలా ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌కు ప్రతిస్పందనగా చాలామంది ట్వీట్లు చేశారు.

 

 

ఆసక్తికర ఫోటో

ముంబై వరదలపై ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఆసక్తికర ఫోటో ఒకటి పెట్టారు. అది చాలా ఫన్నీగా ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This super viral tweet of Anand Mahindra on Mumbai rains shows helping and never say die spirit of the Aamchi Mumbai
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot