ఫేస్‌బుక్‌ హ్యాక్ కావడానికి ఈ మూడు పదాలు చాలట !

|

సోషల్ మీడియా నేడు అమితవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. అది లేకుండా స్మార్ట్ ఫోన్ లేదు అనడం ఇప్పుడు అతిశయోక్తి కాదేమో..అయితే అదే తరుణంలో అనేక రకాల ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పదాలు టైప్ చేస్తే మీకు మంచి వార్త అందుతుందనో లేక ఈ పదం టైప్ చేయడం వల్ల మీరు ఏదో ప్రయోజనాన్ని పొందుతారనో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య BFF అనే పదం కూడా Facebookలో బాగా పాపులర్ అయిపోయింది. ఈ పదం టైప్ చేయడం ద్వారా మీరు మీ Facebook సేఫ్ గా ఉందో లేదో తెలుసుకోవచ్చని దీన్ని జుకర్ బర్గ్ ప్రవేశపెట్టారనే వార్త బాగా దూసుకెళ్లింది. అయితే ఇది పచ్చి అబద్దమని అలా టైప్ చేస్తే అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటి జోలికి వెళ్లవద్దని చెబుతున్నారు.

 

థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుండి మీ Facebook ఖాతాను డిస్కనెక్ట్ చేయడం ఎలా ?థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుండి మీ Facebook ఖాతాను డిస్కనెక్ట్ చేయడం ఎలా ?

Facebookలో BFF టైపు చేస్తే..

Facebookలో BFF టైపు చేస్తే..

మీరు మీ Facebookలో BFF టైపు చేస్తే అది గ్రీన్ కలర్ లోకి వస్తుందని తద్వారా మీ అకౌంట్ చాలా సేప్ గా ఉంటుందని కాబట్టి వెంటనే దీన్ని టైప్ చేయండని ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఇది ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ నుంచి వచ్చిందని కాబట్టి వీలయినంత తొందరగా టైపు చేసి మీ అకౌంట్ ని కాపాడుకోండని చెబుతున్నారు.

ఇది పచ్చి అబద్దం

ఇది పచ్చి అబద్దం

అయితే ఇది పచ్చి అబద్దం అలాంటేదేది ఫేస్ బుక్ నుంచి మార్కెట్లోకి రాలేదు. కొంతమంది దీన్ని టైప్ చేస్తే బ్లాక్ రంగులో కూడా వస్తుంది. అయితే వారి అకౌంట్ అంత సేఫ్ కాదా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఈ పదం టైప్ చేస్తే మీ అకౌంట్ హ్యక్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ డేటాను రక్షించుకోవాలనే తాపత్రయంలో..
 

మీ డేటాను రక్షించుకోవాలనే తాపత్రయంలో..

మీ డేటాను రక్షించుకోవాలనే తాపత్రయంలో మీరు ఇలాంటి పొరపాట్లు చేయవద్దని వారు చెబుతున్నారు. ఈ పోస్ట్ పెట్టగానే వేల సంఖ్యలో యూజర్లు టైప్ చేస్తున్నారు. వారి అకౌంట్లకి సంబంధించిన సమాచారం సులువుగా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది దీని మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

అకౌంట్లను డిలీట్ చేసేందుకు..

అకౌంట్లను డిలీట్ చేసేందుకు..

ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా హ్యాక్ అవుతుందని రకరకాల కంప్లయిట్లు వస్తున్న నేపధ్యంలో ఫేస్ బుక్ ఇటువంటి వాటి మీద బాగా దృష్టి సారించింది. అలాంటి వాటిని పెడుతున్న అకౌంట్లను డిలీట్ చేసేందుకు రెడీ అయింది. కాబట్టి మీరు తొందరపడి అటువంటి వాటిని షేర్ చేయడం కాని టైప్ చేయడం కాని చేయవద్దని అసలు వాటి జోలికి వెళ్లవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎఫ్‌బీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? తెలుసుకోండిలా.

ఎఫ్‌బీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? తెలుసుకోండిలా.

ఫేస్‌బుక్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లోని బాణం గుర్తులా ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.ఎడమ వైపు జనరల్ కింద ఉన్న సెక్యూరిట్ అండ్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.మీ ఫోన్, సిస్టమ్ నుంచి కాకుండా మరో డివైజ్ నుంచైనా లాగిన్ అయ్యి ఉంటే మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు భావించొచ్చు.

ఏ టైంలో లాగిన్ అయ్యారో..

ఏ టైంలో లాగిన్ అయ్యారో..

మీ ఫేస్‌బుక్ ఖాతాలోకి ఏ టైంలో లాగిన్ అయ్యారో, ఏ గ్యాడ్జెట్ల నుంచి లాగిన్ అయ్యారో పూర్తి వివరాలు ఉంటాయి. ఏయే డివైజ్‌లలో లాగిన్ అయి ఉన్నారు, ఏ టైం నుంచి లాగిన్ అయ్యి ఉన్నారో కూడా ఉంటాయి.

డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే

డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే

ఒకవేళ వేరే డివైజ్ నుంచి లాగిన్ అయ్యి ఉంటే కుడి వైపు ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే నాట్ యూ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత సెక్యూర్ అకౌంట్ అని ఫేస్‌బుక్ అడుగుతుంది. ఇక్కడ మీ అకౌంట్ సెక్యూరిటీని పెంచుకోవడం కోసం ఆప్షన్స్ ఉంటాయి. అనుమానం ఉన్న డివైజ్ దగ్గర లాగౌట్‌పై క్లిక్ చేయొచ్చు. తర్వాత పాస్‌వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది. చివర్లో లాగౌట్ ఆఫ్ ఆల్ సెషన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

మరింత సెక్యూర్‌గా ఉండటం కోసం..

మరింత సెక్యూర్‌గా ఉండటం కోసం..

మరింత సెక్యూర్‌గా ఉండటం కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా కొత్త డివైజ్ నుంచి లాగిన్ అయితే మీ ఫోన్‌కు మెసేజ్ అందుతుంది. మీ అకౌంట్ హ్యాక్ అయితే అన్‌లాక్ చేయడం కోసం కొన్ని నమ్మకైన కాంటాక్ట్ నంబర్లు ఇవ్వొచ్చు.

Best Mobiles in India

English summary
Thousands Of Indians Are Falling For A Facebook Hoax That Typing BFF Checks If Their Account Has Been Hacked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X