మెసేంజర్‌లో మీకు తెలియని ఫీచర్స్ గురించి తెలుసుకోండి

|

సోషల్ మీడియా నేడు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మాధ్యమం. ముఖ్యంగా ఫేస్ బుక్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామిగా మారిపోయింది. ముఖ్యంగా యూత్ దీనికి అడిక్ట్ అయిపోయారు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వారకు ఫేస్ బుక్ వేదికగా అన్ని షేర్ చేసుకుంటున్నారు. సుమారు 130 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ ను పూర్తిగా వాడుతున్నారా అంటే అనుమానమే. ఫేస్ బుక్ అంటే కేవలం కామెంట్స్ పోస్ట్ చేయడం, ఫోటోలు షేర్ చేయడమేనా అంటే కాదని దీనితో బోలెడు పనులు చేయచ్చంటున్నారు టేక్ సేవీలు.

 

బోలెడు పనులు

బోలెడు పనులు

1. మీ కంప్యూటర్ లో మెసేంజర్ గా వాడుకోవచ్చు.
మీరు ఫేస్ బుక్ అప్ డేట్స్ తో విసిగిపోయారా. కేవలం మీ ఫ్రెండ్స్ షేర్ చేసే న్యూస్ ఫీడ్, ఫోటోస్ మాత్రమే కాదు. మెసెంజర్ డాట్ కామ్ లో కి వెళ్లి మీ కంప్యూటర్ లో మెసెంజర్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ లోని ఆన్ లైన్ లో ఉన్న వ్యక్తులతో చాట్ చేసుకోవచ్చు. దీన్ని డెస్క్ టాప్ ఐకాన్ సెట్ చేసుకొని ఎంచక్కా మెసెంజర్ సర్వీసులను పొందవచ్చు.
2. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌకర్యం..
ప్రస్తుతం డిజిటల్ మీడియా ద్వారా డబ్బు పంపుకోవడం చాలా సులభంగా మారింది. అయితే ఫేస్ బుక్ కూడా ఓ పేమెంట్ గేట్ వే గా వాడుకోవచ్చు. ముఖయంగా వెన్మో యాప్ ద్వారా మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను అటాచ్ చేసుకొని ఎంచక్కా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ముందుగా మీ డెబిట్ కార్డును ప్రొఫైల్ కు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫైల్ > పేమెంట్స్ > యాడ్ న్యూ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేమెంట్ గేట్ వేను వాడుకునే అవకాశం ఉంది.

 

 

బోలెడు పనులు
 

బోలెడు పనులు

3. ప్రొఫైల్ కోడ్ ద్వారా ఫ్రెండ్స్ ను యాడ్ చేసుకునే అవకాశం.
మీకు నచ్చిన వారిని ఫ్రెండ్ చేసుకోవాలని ఉందా. అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ తో సంబంధం లేకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. యూనిక్ ప్రొఫైల్ కోడ్ క్రియేట్ చేసుకొని స్కాన్ చేసుకోవడం ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మీ ప్రొఫైల్ ఐకాన్ ను క్లిక్ చేయగానే టాప్ లెఫ్ట్ కార్నర్ లో యాప్ కనిపిస్తుంది. ప్రొఫైల్ పిక్చర్ ను మధ్యలో క్లిక్ చేయగానే. మధ్యలో ప్రెస్ మై కోడ్ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే స్కాన్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని ఫ్రెండ్ చేసుకునే వీలు కలుగుతుంది.

4. గేమ్స్ ఆడుకోవచ్చు
ఫేస్ బుక్ ద్వారా గేమ్స్ ఆడుకునే వీలుంది. ఇందులోని ప్రీలోడెడ్ గేమ్ యాప్స్ ద్వారా అన్ లిమిటెడ్ వినోదం పొందవచ్చు. మీరోక్కరే కాదు. ఇందులో వేరే ప్రొఫైల్ వారితో కూడా గేమ్స్ ఆడవచ్చు. పాక్ మ్యాన్, స్నేక్ వంటి బేసిక్ గేమ్స్ తో పాటు ఛాలెంజ్ గేమ్స్ వరకూ అనేక గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు జోడీ కావాలనుకుంటే జోడీతో, ఒంటరిగా ఆడాలి అనుకుంటే ఒంటరిగా ఆడుకునే వీలుంది.

 

బోలెడు పనులు

బోలెడు పనులు

5. బాట్స్ తో చాట్ చేసుకునే అవకాశం..
చాట్ బాట్స్ ఇప్పుడు ఆటోమేటిగ్గా మీకు ఎలాంటి సమాచారాన్నైనా అందించే చాట్ బాట్స్ ఎన్నో మెసెంజర్స్ లో అందుబాటులోకి వచ్చాయి. మీకు కావాల్సిన న్యూస్, సలహాలు, అడ్రస్ లు, సూచనలు అప్ డేట్స్ ఇలా ఒకటేమిటీ సమస్తం మీతో పంచుకోవడానికి ఈ ఆటోమేటిక్ చాట్ బాట్స్ సిద్ధంగా ఉన్నాయి.
6. గోప్యంగా చాటింగ్..
వాట్సప్ తరహాలోనే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ తో చాటింగ్ చేసుకునే వీలుంది. దీంతో మీ చాటింగ్ మధ్యలోకి మూడో వ్యక్తి దూరకుండా వీలు కలిగింది. చాట్ బాక్స్ లో కుడివైపు కార్నర్ లో ఉన్న ఆప్షన్ ను క్లిక్ చేయగానే మీ చాట్ గోప్యంగా ఉందో లేదో ఇట్టే గుర్తు పట్టేయొచ్చు.

బోలెడు పనులు

బోలెడు పనులు

7. మీ చాట్ ను కస్టమైజ్ చేసుకోండిలా..
ఫేస్‌బుక్ లో మీ చాటింగ్ ను సరదాగా మార్చేందుకు ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ గ్రూప్ చాట్ బాక్స్ కలర్ మార్చుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కు నిక్ నేమ్స్ ఇవ్వచ్చు. ఇలాగే మీ గ్రూప్ అంతటికి కలిపి ఒక ఇమోజీ ఏర్పాటు చేసుకోవచ్చు.

8. సమాచారం తెలుసుకోండిలా...
ఫేస్ బుక్ మెసెంజర్ కేవలం చాటింగ్, షేరింగ్ కే పరిమితమా అంటే కానే కాదు. మీ ఫ్రెండ్స్ కు మెసెంజర్ ద్వారా బోలెడు హెల్ప్ చేయవచ్చు. ఉదాహరణకు వారు ఏదైనా ప్రయాణంలో ఉంటే వారు ఉన్న ప్రదేశంలోని హోటల్స్, రెస్టారెంట్స్, దర్శనీయ స్థలాలకు సంబంధించిన వివరాలను మీరు షేర్ చేయవచ్చు. అలాగే సాంగ్స్, న్యూస్ అప్ డేట్స్ లాంటివి కూడా పంచుకోవచ్చు.

9. స్క్రిబుల్ చాట్..
టైప్ చేసి చేసి బోర్ కొట్టేస్తోంది. అయితే స్క్రీన్ పై మీరు పెన్ తో రాసినట్టు రాయండి. అదే త్రీడీ యానిమేషన్ లుక్ తో మెసేజ్ సెండ్ అవుతుంది. దీన్నే స్క్రిబుల్ చాట్ అంటారు. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి.
10. ఆడియో క్లిప్ పంపడం..
మీకు నచ్చిన పాట, లేదా, మాట, సందేశం ఇలా ఏదైన సరే చాట్ బాక్స్ ద్వారా రికార్డ్ చేసి పంపే సదుపాయం ఫేస్ బుక్ మెసెంజర్ లో ఉంది. సరిగ్గా మీరు టైప్ చేసే బాక్స్ పక్కనే ఉన్న రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పంపవచ్చు. అంతేకాదు ఫైల్ అటాచ్ మెంట్స్ ద్వారా కూడా ఆడియో క్లిప్స్ పంపవచ్చు.

 

Best Mobiles in India

English summary
Here's some of the coolest stuff you didn't know you could do with Facebook Messenger.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X