సెలబ్రెటీ పోర్న్ కంటెంట్ పై ట్విట్టర్ కన్నెర్ర...

Posted By: BOMMU SIVANJANEYULU

సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ పోర్న్ వీడియోలను సృష్టిస్తూ, వాటిని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తోన్న వారిపై ఆ సంస్థ కఠినచర్యలకు సిద్ధమైంది. తక్షణ చర్యగా ఆయా అకౌంట్లను సస్పెండ్ చేస్తోంది. అడల్డ్ కంటెంట్‌కు తాము పూర్తిగా వ్యతిరేకమని, అటువంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే వారికి అకౌంట్లను సస్పెండ్ చేయటం జరుగుతుందని ట్విట్టర్ హెచ్చరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ లిస్ట్‌లో @mydeepfakes

ట్విట్టర్ ద్వారా అడల్ట్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తోన్న @mydeepfakes అనే అకౌంట్‌ను ట్విట్టర్ ఇప్పటికే సస్పెండ్ చేసి బ్లాక్ లిస్ట్‌లో ఉంచిది. మెచీన్ లెర్నింగ్ అల్గారిథమ్ టెక్నాలజీ ద్వారా ఈ ఫేక్ పోర్న్ వీడియోలను వీరు అప్‌లోడ్ చేస్తున్నట్లు ట్విట్టర్ గుర్తించింది.

సోషల్ మీడియా కంటూ కొన్ని పరుధులు

ఇంటర్నెట్ మీడియా అనేది ఓ అద్బుతమైన కమ్యూనికేషన్ సాధనం. ఎటువంటి సమాచారాన్ని అయినా ఇక్కడ మీరు పొందవచ్చు.అయితే, ఇంటర్నెట్ కంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించ కూడుదు. ఇంటర్నెట్ స్వేచ్చకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి.

అభ్యంతరకర పోస్టులకు దూరంగా ఉండండి...

ఆన్‌లైన్‌లో ఉన్నప్పడు మీరేం పోస్టు చేస్తున్నారనేది ముందు గమనించుకోండి. అది పోస్టు చేయడానికి తగినదేనా కాదా అన్నదీ నిర్ధారించుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు. సరదాకో, తమషాకో మీరు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపొచ్చు.

Airtel Sim Owner వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్

చట్ట వ్యతిరేక చర్య...

టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేర్ చేయటమనేది చాలా దేశాల్లో చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. ఫైల్ షేరింగ్ అంటే కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సినిమా, మ్యూజిక్ ఇంకా ఫైల్స్‌ను యజమాని పర్మిషన్ లేకుండా షేర్ చేయటమనేది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు.

ఓపెన్ వై-ఫైతో చాలా ప్రమాదం...

మీకు ఓపెన్ వై-ఫై ఉందా..? మీకు ఓపెన్ వై-ఫై ఉందా అయితే, వెంటనే దానికి పాస్ వర్డ్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఓపెన్ వై-ఫైను ఇతరలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పోర్నోగ్రఫీ ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలు.

సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసినందకు..

ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని కొన్ని కొన్ని సందర్భాల్లో డిలీట్ చేయవల్సి వస్తుంది. అమెరికాకు చెందిన డేవిట్ అనే వ్యక్తిని యాహూ అకౌంట్ హ్యాకింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డేవిడ్ ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ చాలా కీలకంగా వ్యవహరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Twitter bans fake celebrity porn videos, accounts
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot