‘280 క్యారెక్టర్ లిమిట్‌’తో ట్విట్టర్ దూకుడు

|

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. వ్యక్తిగత ట్వీట్లు పంపుకునేందుకు ఇప్పటి వరకు అందుబాటులో 140 క్యారెక్టర్ లిమిట్‌ను 280 క్యారెక్టర్ లిమిట్‌కు పొడిగిస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా దేశాల్లోని ట్విట్టర్ యూజర్లు 280 క్యారెక్టర్‌లతో ట్వీట్లను పంపుకోగలుగుతున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో ఏదైనా విషయాన్ని చెప్పాలంటే నాలుగైదు ట్వీట్లుగా విడగొట్టి చెప్పాల్సి వచ్చేది. ఇక పై ఆ అవసరం ఉండకపోవచ్చు. మొత్తం విషయాన్ని ఒకే ట్వీట్‌లో చెప్పే వీలుంటుంది.

Twitter expands character limit to 280; but not for all

ట్వీట్లలో 280 క్యారెక్టర్ లిమిట్ క్యాప్‌ను సెప్టంబర్ నుంచే ట్విట్టర్ పరీక్షిస్తూ వస్తోంది. ఈ ఫీచర్ మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కొత్త క్యారెక్టర్ లిమిట్‌ను పరిచయం చేసిన తరువాత నుంచి ఇంగ్లీష్ ట్వీట్‌లలో లిమిట్ డ్రాప్ అవటం 9 శాతం నుంచి 1 శాతానికి తగ్గిందని ట్విట్టర్ తెలిపింది.

అయితే.. జపనీస్, కొరియన్ ఇంకా చైనీస్ భాషల్లో చేసే ట్వీట్లకు మాత్రం పొడిగించబడిన క్యారెక్టర్ లిమిట్ వర్తించదని ట్విట్టర్ తెలిపింది. ఈ భాషల్లో చేసే ట్వీట్లకు ఎక్కువ క్యారెక్టర్స్ అవసరమవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లురూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లు

ట్విట్టర్‌కు షాకిచ్చిన ఇద్దరు హ్యాకర్లు ఏకంగా 35,000 క్యారెక్టర్లతో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేయగలిగారు. జర్మనీకి చెందిన చెందిన టిమ్రాసిట్, హ్యాక్నీవైటీ అనే హ్యాకర్లు 280 క్యారెక్టర్ లిమిట్ క్యాప్‌ను చేధించి యూఆర్ఎల్ కోడిఫైర్ అనే ఎంబెడెడ్ పద్ధతి ద్వారా 35,000 క్యారెక్టర్లతో అర్థంకాని ఓ ట్వీట్‌ను పోస్ట్ చేయగలిగారు. విషయాన్ని గుర్తించిన ట్విట్టర్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించటంతో పాటు వారి అకౌంట్‌లను సస్పెండ్ చేసింది.

Best Mobiles in India

Read more about:
English summary
Notably the increased character limit is not applicable to Twitter users tweeting in Japanese, Chinese and Korean.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X