12 లక్షల అనుమానాస్పద అకౌంట్లపై వేటు

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ట్విటర్‌ అనుమానాస్నద అకౌంట్లను ఏరిపారేసింది. 2015 ఆగస్టు నుంచి 2017 సంవత్సరం చివరి వరకు తమ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌పై టెర్రరిజం కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న 12 లక్షలకు పైగా అకౌంట్లను రద్దు చేశామని ట్విటర్‌ వెల్లడించింది. టెర్రరిజాన్ని ప్రోత్సాహిస్తూ వారికి అనుకూలంగా ట్వీట్లు చేస్తున్న 274,460 అకౌంట్లను గత ఆరు నెలల కాలంలో శాశ్వతంగా రద్దు చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. 12th biannual Twitter Transparency Reportలో భాగంగా కంపెనీ తన బ్లాగ్‌స్పాట్‌లో ఈ విషయాలను వెల్లడించింది. ఈ సంఖ్య గత రిపోర్టులతో పోలిస్తే 8.4 శాతం తక్కువని పేర్కొంది. అంతేకాక 2015 ఆగస్టు నుంచి 12 లక్షలకు పైగా అకౌంట్లు రద్దు అయినట్టు చెప్పింది.

 
12 లక్షల అనుమానాస్పద అకౌంట్లపై వేటు

ఈ కారణంతో రద్దు చేసే అకౌంట్ల సంఖ్య వరుసగా రెండు కాలాల నుంచి తగ్గుతూ వస్తున్నట్టు ట్విటర్‌ తెలిపింది. తమ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై పాజిటివ్‌నే చూస్తూ ఉన్నామని ఆనందం వ్యక్తంచేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకునే వారికి, తమ సైట్‌ అవాంఛనీయమైన స్థలమని, గత కొన్నేళ్లుగా తాము చేస్తున్న ఈ కృషి వల్ల దీన్ని నిరూపిస్తున్నామని తెలిపింది. దీంతో ట్విటర్‌ నుంచి ఇలాంటి కార్యకలాపాలు భారీగా తొలిగిపోతున్నాయని పేర్కొంది.

ఇవి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో కొత్త మొబైల్ కొనవద్దుఇవి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో కొత్త మొబైల్ కొనవద్దు

2015 ఆగస్టు నుంచి 2017 డిసెంబర్‌ వరకు 12,10,357 అకౌంట్లను రద్దు చేశామని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటూ నిబంధనలు ఉల్లఘిస్తున్న అకౌంట్లపైనే వేటు వేసినట్టు తెలిపింది. తొలి ట్వీట్‌కు ముందే ఈ కార్యకలాపాలతో సంబంధమున్న 74 శాతం అకౌంట్లను రద్దు చేసినట్టు పేర్కొంది.

Best Mobiles in India

English summary
Twitter Has Suspended 1.2 Million Accounts For Terrorist Content More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X