ట్విట్టర్‌లో రెండు కొత్త ఫీచర్లు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ రెండు సరికొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్‌వర్కింగ్‌తో పాటు ఆన్‌లైన్ న్యూస్ సర్వీసులను అందిస్తోన్న ట్విట్టర్, గురునానక్ జయంతిని పురస్కరించుకుని స్పెషల్ Emojiని ఆవిష్కరించింది. గురునానక్ జయంతి రోజున ఈ స్పెషల్ ఎమోజీ అందబాటులో ఉంటుంది. సిక్కుల మత విశ్వాసం ప్రకారం 'ఇక్ ఓన్‌కార్' అనే గుర్తు "ఇది అనేకం కాదు ఒక్కటే" అన్న భావాన్ని సూచిస్తుంది.

ఈ సత్యసూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రత్యేకమైన Emojiని డిజైన్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. గురునానక్ జయంతిని సందర్భంగా Emojiని అందుబాటులోకి తీసుకురావటం ట్విట్టర్‌కు ఇదే మొదటి సారి.
గతంలో ఇండిపెండెన్స్ డే, రిప్లబిక్ డే, ఇంటర్నేషనల్ యోగా డే, వినాయక చవతి, అంబేద్కర్ జయంతి, దీపావళి వంటి ప్రత్యేకమైన పర్వదినాలకు మాత్రమే ట్విట్టర్ ఎమోజీలను డెడికేట్ చేయటం జరిగేది. ఇప్పుడు అదనంగా మరో ఎమోజీ యాడ్ అయ్యింది.

ఈ ఎమోజీతో పాటు వీడియో వెబ్‌సైట్ కార్డ్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ట్విట్టర్ అనౌన్స్ చేయటం జరిగింది. వాణిజ్య ప్రకటనదారులు కోసం డిజైన్ చేయబడిన ఈ ఫీచర్ ద్వారా కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను అడ్వర్టైజ్ చేయటంతో పాటు ప్రమోట్ చేసుకునే వీలుంటంది. ఈ వీడియో వెబ్‌సైట్ కార్డులో ఆటో-ప్లేయింగ్ వీడియో, కస్టమైజబుల్ హెడ్‌లైన్, డెస్టినేషన్ యూఆర్ఎల్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీంతో ప్రకటనదారులు తమ వీడియో న్యూస్ అలానే వెబ్‌సైట్ క్లిక్స్‌ను మానిటర్ చేసుకునే వీలుంటుంది.
సినిమా ప్రమోషన్‌లకు కూడా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకునే వీలుంటుందని ట్విట్టర్ చెబుతోంది. మోటారోలా తన స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్స్ నిమిత్తం ఇప్పటికే ఈ ఫీచర్‌ను వినియోగించుకుంటోంది. మరోవైపు అమెజాన్ ఇండియా కూడా వీడియో వెబ్‌సైడ్ కార్డును ఉపయోగించుకుంటోంది. ఎల్‌జీ, గోఐబీబో, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీలు సైతం తమ వ్యాపార ప్రయోజనాల నిమిత్తం ఈ ఫీచర్‌ను వినియోగించు కుంటన్నాయి.


Click it and Unblock the Notifications