చిన్న తప్పుతో Airtelకి చావుదెబ్బ,నెట్‌వర్క్‌ను వదిలేసే ఆలోచనలో కస్టమర్లు

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న Airtel చేసిన చిన్న పొరపాటు దాని పీకల మీదకు వచ్చి కూర్చుంది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న Airtel చేసిన చిన్న పొరపాటు దాని పీకల మీదకు వచ్చి కూర్చుంది. ఈ పొరపాటున ఆసరాగా చేసుకుని చాలామంది ట్విట్టర్లో Airtelని దుమ్మెత్తిపోస్తున్నారు. Airtel దీనిపై సారీ చెప్పినప్పటికీ కూడా ట్విట్టర్లో ట్వీట్లు ఆగడం లేదు. ఇంతకీ అసలు స్టోరీ ఏమిటి అనుకుంటున్నారా..Airtel మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిని చేస్తుందట..సోషల్ మీడియాలో ట్రెంట్ అవుతున్న వివరాల ప్రకారం..

 

ట్రాఫిక్ కష్టాల గురించి ఇంతకంటే బాగా ఎవరూ చెప్పరు !ట్రాఫిక్ కష్టాల గురించి ఇంతకంటే బాగా ఎవరూ చెప్పరు !

 వివాదాస్పద అభ్యర్ధన

వివాదాస్పద అభ్యర్ధన

ఓ మహిళా వినియోగదారురాలు ‘హిందూ కస్టమర్‌ సర్వీస్‌ పర్సన్నే పంపించండంటూ చేసిన వివాదాస్పద అభ్యర్ధనను టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అంగీకరించడంతో ఈ న్యూస్ ఇప్పుడు ట్విటర్‌లో తెగ ట్రోల్ అవుతుంది .

పూజా సింగ్‌ అనే మహిళా కస్టమర్‌

సోషల్ మీడియలో వస్తున్న వివరాల ప్రకారం...పూజా సింగ్‌ అనే మహిళా కస్టమర్‌ తన ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ కనెక్షన్‌లో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించమని ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసింది.

 

Airtel కంపెనీ

Airtel కంపెనీ, కస్టమర్‌ పూజ చేసిన కంప్లైంట్‌ను పరిష్కరించడానికి షోయబ్‌ అనే సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపించింది. 

అందుకు పూజా సింగ్ కోపంతో ‘తాను ఇండియన్‌ హిందువునని..తనకు ముస్లింల సర్వీస్‌ మీద నమ్మకం లేదు..వెంటనే షొయబ్‌ స్థానంలో మరో హిందూ సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపిచాలంటూ Airtel కంపెనీకి ట్విటర్‌లో పోస్టు చేసింది.

మెసేజ్‌లను చూసిన నెటిజన్లు

మెసేజ్‌లను చూసిన నెటిజన్లు

కాగా Airtel కంపెనీకి తనకు మధ్య జరిగిన ఈ మెసేజ్‌ చాట్‌ను ట్విటర్‌లో పోస్టు చేసింది పూజ. అది కాస్తా Airtel మెడకు చుట్టుకుంది. ఈ మెసేజ్‌లను చూసిన నెటిజన్లు ఎయిర్‌టెల్‌ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా

మీ కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా మత దురభిమానం ఉన్న వారిని ప్రోత్సాహిస్తున్నారంటూ ఎయిర్‌టెల్‌ను సోషల్ మీడియాలో అందరూ తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

 

జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా

ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్‌ చేసిన పనిని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయం గురించి ‘ఎయిర్‌టెల్‌ కంపెనీ తన ఉద్యోగులను మతం పేరుతో వేరు చేసి చూస్తుంది. మత దురభిమానాన్ని ప్రచారం చేసే ఇలాంటి కంపెనీ‍కి కస్టమర్‌గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను.

నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా

నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా

ఇక మీదట నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఎయిర్‌టెల్‌ సేవల కోసం ఖర్చు చేయను. తక్షణమే నా నంబర్‌ను వేరే సర్వీస్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. అంతేకాక నా ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ కనేక్షన్‌లను కూడా తొలగించాలనుకుంటున్నాను' అంటూ ట్వీట్‌ చేసారు.

ఎయిర్‌టెల్‌ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ

ఎయిర్‌టెల్‌ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ

ఇందుకు ఎయిర్‌టెల్‌ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ ‘జరిగిన విషయానికి మేము చింతిస్తున్నాము. కంపెనీ ఎప్పుడు కూడా తన వినియోగదారులను, ఉద్యోగులను, భాగస్వాములను కుల, మత ప్రాతిపదికన వేరు చేసి చూడదం'టూ రీట్వీట్‌ చేసింది.

ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు

ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు

మొత్తానికి ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ముందు ముందు Airtel ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Woman Asks Airtel For 'Hindu Representative'; Twitterati React more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X