పోర్న్ దెబ్బ, సోషల్ మీడియాపై పన్ను, దేశ వ్యాప్తంగా నిరసన సెగలు

ఈ రోజుల్లో ప్రపంచాన్ని సోషల్ మీడియా జ్వరం పట్టి పీడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ మాట ప్రపంచం మొత్తాన్నికుదిపేస్తోంది.

|

ఈ రోజుల్లో ప్రపంచాన్ని సోషల్ మీడియా జ్వరం పట్టి పీడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మాట ప్రపంచం మొత్తాన్నికుదిపేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, స్కైప్‌ ఇంకా ఇతర సోషల్ మీడియా యాప్స్ వినియోగం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త యువతను విలవిలలాడేలా చేస్తోంది. సోషల్‌ మీడియా వినియోగించాలి అంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలనే వార్తకు యువత నోట మాట రావడం లేదు. అయితే ఇకపై అక్కడ సోషల్ మీడియా వాడితే పన్ను చెల్లించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా.. ఉగాండాలో..

బ్లాక్ చేసిన వారు మళ్లీ అన్‌బ్లాక్ లోకి, ఎఫ్‌బిలో మరో బగ్ !బ్లాక్ చేసిన వారు మళ్లీ అన్‌బ్లాక్ లోకి, ఎఫ్‌బిలో మరో బగ్ !

సోషల్ మీడియాని ఉపయోగించాలంటే..

సోషల్ మీడియాని ఉపయోగించాలంటే..

జులై 1 నుంచి ఉగాండా ప్రభుత్వం అధికారికంగా సోషల్‌ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది.ఇకపై ఆ దేశంలో ఎవరైనా సోషల్ మీడియాని ఉపయోగించాలంటే పన్నును చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా యువత నిరసన

దేశవ్యాప్తంగా యువత నిరసన

దీనిపై ఆ దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రోడ్డెక్కి యువత నిరసన తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం ముందుకెళుతోంది. 

ఉగాండా ప్రభుత్వం..

ఉగాండా ప్రభుత్వం..

అయితే, ఉగాండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నట్లుండి ఏమీ తీసుకోలేదు. ముందుగానే ఈ పన్నును విధించబోతున్నట్లు ప్రకటించింది.

రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌..

రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌..

ఇకపై వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, స్కైప్‌ వంటి సోషల్‌ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌ను చెల్లించాలి.

యువతను అదుపు చేసేందుకు

యువతను అదుపు చేసేందుకు

దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు. 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(టీఆర్‌ఏ) ఎన్నికల సందర్భంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

దేశ ఆదాయం, సమయం వృథా

దేశ ఆదాయం, సమయం వృథా

సోషల్‌ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది సోషల్‌ మీడియా పన్నును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టీఆర్‌ఏ సూచించింది.

22 శాతం మంది మాత్రమే..

22 శాతం మంది మాత్రమే..

అమల్లోకి వచ్చిన పన్నును ఎలా చెల్లించాలనే దానిపై ఎంటీఎన్‌, ఎయిర్‌టెల్‌, ఆఫ్రిసెల్‌లు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కాగా, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

పోర్న్‌ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు..

పోర్న్‌ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు..

పోర్న్‌ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు ఉగాండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రత్యేక డివైజ్‌ను ఆ దేశం ఇందుకోసం తెప్పించినట్లు సమాచారం.

స్కాన్‌

స్కాన్‌

దీని ద్వారా దేశంలో ఇంటర్నెట్‌ వినియోగించే ప్రతి ఒక్కరి కంప్యూటర్లను, మొబైల్‌ ఫోన్లను స్కాన్‌ చేస్తారని తెలిసింది. అయితే, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారం లేకుండా ఇది అసాధ్యమని నిపుణులు అంటున్నారు.

 విధించిన పన్ను ద్వారా..

విధించిన పన్ను ద్వారా..

తూర్పు ఆఫ్రికాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఉగాండా ఆయిల్ నిక్షేపాలను వెలికితీసేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కుటోంది. ఇప్పుడు విధించిన పన్ను ద్వారా ఆ ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏటా 360 మిలియన్‌ డాలర్ల ఆదాయం..

ఏటా 360 మిలియన్‌ డాలర్ల ఆదాయం..

సోషల్‌ మీడియా పన్ను ద్వారా ఏటా 360 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని ఆ దేశాధ్యక్షుడు ముసేవేని భావిస్తున్నారు. మరి ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందా యువత సైలెంట్ అవుతారా అనేది మరికొద్ది రోజులు ఆగితే కాని తెలియదు.

Best Mobiles in India

English summary
Ugandans are furious with a new tax for using social media and mobile money More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X