సోషల్ మీడియాలో వణుకు పుట్టిస్తున్న దయ్యం వీడియో
అసలు దయ్యాలు ఉన్నాయా? ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న.
అసలు దయ్యాలు ఉన్నాయా? ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేం దయ్యాలను చూశామని అంటే.. అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. ఇంతకీ దయ్యాలు ఉన్నాయో లేదో అనేది మాత్రం ఎప్పటికి వీడని మిస్టరీ గానే మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వణుకు పుట్టిస్తోంది .
సింగపూర్ లో ఓ కంప్యూటర్ సర్వర్ రూమ్ లో ఓ దయ్యం కెమెరా కు చిక్కిన వీడియో వైరల్ అవుతోంది.

ఒక వింత ఆకారం రూమ్ లో కి రావడం....
ఏదో ఒక వింత ఆకారం రూమ్ లో కి రావడం అన్ని చిందర బంధర చేయడం,వస్తువులు పడేయడం ,అక్కడ ఉన్న మ్యాక్ బుక్ ని వాడడం మీరు సర్వర్ రూమ్ లోని ఫుటేజ్ లో చూడొచ్చు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే....
కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డోర్ కి అవతల వైపు ఉన్న సీసీటీవీ టీవీ ఫుటేజ్ ని బట్టి చూస్తే ఎవరు కూడా ఆ డోర్ ను మ్యానిపులేట్ చేసినట్టు కనిపించలేదు.

ఈ వీడియో వాస్తవానికి ....
ఈ వీడియో వాస్తవానికి Facebook పేజీ ఘోస్ట్, పారానార్మల్ మరియు ఇతర వియర్డ్ వరల్డ్స్ ద్వారా 17 ఆగస్టు 2018 న ఆన్ లైన్ లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో 37,000 వ్యూవ్స్ అందుకుంది.

తాజాగా ఈ వీడియో మరో సారి....
తాజాగా ఈ వీడియో మరో సారి పేస్ బుక్ లో సర్క్యులేట్ అవుతుంది. నిన్న వీడియోను పోస్ట్ చేసిన తర్వాత మరో 25,000 వ్యూవ్స్ ను అందుకుంది


Click it and Unblock the Notifications








