యజమాని ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్ డాగ్, వైరల్ వీడియో ఇదే !

ఇంట్లో పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్‌, షాకింగ్ వీడియోని చూడండి

|

ఎలక్ట్రానిక్ వస్తువులు వాడాలంటే ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అవి ఎప్పుడు పేలిపోతాయో తెలియకపోవడమే. ప్రధానంగా ఛార్జింగ్ సమయంలో ఇవి పేలిపోయి చాలామందికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. సెల్‌ఫోన్లు, పవర్‌ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు పేలిన ఘటనలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా పేలిపోతున్నాయి. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే..

బ్లూ వేల్ కన్నా డేంజర్ గేమ్, ఆడి ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలికబ్లూ వేల్ కన్నా డేంజర్ గేమ్, ఆడి ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక

చైనాకు చెందిన ఓ వ్యక్తి..

చైనాకు చెందిన ఓ వ్యక్తి..

చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని చార్జింగ్‌ పెట్టి కూతురితో మాటల్లో మునిగిపోయాడు.

స్కూటర్‌ నుంచి పొగలు

స్కూటర్‌ నుంచి పొగలు

కాసేపటి తర్వాత స్కూటర్‌ నుంచి పొగలు రావడంతో పక్కనే ఉన్న పెంపుడు కుక్క అరవడం మొదలు పెట్టింది.

చూద్దామని దగ్గరికి వెళ్లేలోపే

చూద్దామని దగ్గరికి వెళ్లేలోపే

అసలేం జరిగిందో చూద్దామని దగ్గరికి వెళ్లేలోపే ఇళ్లంతా పొగలు వ్యాపించేశాయి. కొన్ని క్షణాల్లోనే స్కూటర్‌ పేలి పోయింది.

కూతురుని తీసుకుని ..

కూతురుని తీసుకుని ..

అయితే అప్పటికే అప్రమత్తమైన ఆ వ్యక్తి కూతురుని తీసుకుని దూరంగా పరిగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

స్మార్ట్‌ డాగ్‌

స్మార్ట్‌ డాగ్‌

పొగ రావడంతో స్మార్ట్‌ డాగ్‌ ప్రమాదాన్నిముందే పసిగట్టిందని, అందుకే ఆ తండ్రీకూతుళ్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారంటూ నెటిజన్లు పెట్‌ డాగ్‌ను ప్రశంసిస్తున్నారు.

స్కూటర్ కాలి బూడిద

స్కూటర్ కాలి బూడిద

స్కూటర్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.

రెండు వారాల క్రితం

రెండు వారాల క్రితం

ఆ స్కూటర్‌ను రెండు వారాల క్రితం ఆన్ లైన్ లో కొన్నామని.. ఆరు నుంచి 12 గంటల పాటు చార్జింగ్ పెట్టాలని అమ్మిన వ్యక్తి తెలపడంతోనే తాము చార్జింగ్ పెట్టామని ఆ కుటుంబం తెలిపింది.

ప్రాణాలతో సురక్షితంగా

ప్రాణాలతో సురక్షితంగా

ఇంతలో ఇంత పెద్దప్రమాదం జరుగుతుందని ఊహించలేదని భగవంతుడి దయవల్ల ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డామని ఆ కుటుంబం తెలిపింది.

వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో వెలుగులోకి వచ్చింది. అప్‌లోడ్‌ అయిన 11 గంటల్లోపే 60 వేల మంది ఈ వీడియోను వీక్షించారు.

Best Mobiles in India

English summary
Electric scooter explodes inside a house in China; luckily family and pet dog escape unhurt - Watch More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X