Facebook డిలీట్ చేయండి, వాట్సప్ సహా వ్యవస్థాపకుడి పిలుపు, దెబ్బకు కుప్పకూలిన ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజం Facebookకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కేంబ్రిడ్జ్ అనాలటికా ప్రకంపనలతో ఒక్కసారిగా Facebook పాతాళానికి దిగజారిపోయింది.

|

సోషల్ మీడియా దిగ్గజం Facebookకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కేంబ్రిడ్జ్ అనాలటికా ప్రకంపనలతో ఒక్కసారిగా Facebook పాతాళానికి దిగజారిపోయింది. దీనిపై ఇప్పుడూ అందరూ ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో Facebook మీద అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. యూజర్ల ప్రైవసీకి ప్రాముఖ్యం ఇవ్వడంలేదని ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ కూడా Facebook మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో Its time..delete Facebook అంటూ చేసన ట్వీట్ పెను ప్రకంపనలను రేపుతోంది.మరి Facebook పై బ్రియాన్ చేసిన ఆరోపణలు వ్యక్తిగతమైనవా లేక వాట్సప్ నుంచి వచ్చినవా అనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.

 

2016లో ట్రంప్ విజయం వెనుక భారీ స్కెచ్, వెలుగులోకి పచ్చి నిజాలు,ఫేస్‌బుక్‌కు భారీ నష్టం2016లో ట్రంప్ విజయం వెనుక భారీ స్కెచ్, వెలుగులోకి పచ్చి నిజాలు,ఫేస్‌బుక్‌కు భారీ నష్టం

2014లో వాట్సప్ ను..

2014లో వాట్సప్ ను..

2014లో వాట్సప్ ను Facebook గ్రూపు 16 బిలియన్ల డాలర్లకు కొన్న విషయం అందరికీ తెలిసిందే. Facebook వాట్సప్ ను కొనుగోలు చేయడంతో దాని వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. కాగా కంపెనీలో కోమ్ కొనసాగుతుండగా బ్రియాన్ వేరే కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారు.

It is time. #deletefacebook

It is time. #deletefacebook

కాగా తన ఫాలోయర్లను ఉద్దేశించి It is time. #deletefacebook అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాగా పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్టన్ ఈ పిలుపునివ్వడం గమనార్హం.

ఫేస్‌బుక్ యూజర్ల లైకులను
 

ఫేస్‌బుక్ యూజర్ల లైకులను

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ప్రచార బాధ్యతలు నిర్వహించిన బ్రిటిష్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల లైకులను అనధికారికంగా ఉపయోగించుకుంది.

దారుణ నష్టం

దారుణ నష్టం

ఎన్నికలను ప్రభావితం చేసే ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్టు వార్తలు రావడంతో ఫేస్‌బుక్ దారుణంగా నష్టపోయింది. ఫేస్‌బుక్ క్యాపిటల్‌ వాల్యూ, షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై స్పందించిన ఫేస్‌బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికాపై సమగ్ర ఆడిట్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో..

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో..

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.

Best Mobiles in India

English summary
WhatsApp co-founder tells everyone to delete Facebook More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X