వాట్సాప్ లోనే యూట్యూబ్ వీడియోలను నేరుగా చూడవచ్చు

By: SSN Sravanth Guthi

వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో ఇతరుల ద్వారా షేర్ చెయ్యబడిన యూట్యూబ్ వీడియోలను చూడాలంటే అక్కడ ఉన్న లింకు మీద టచ్ చెయ్యగానే, వాట్సాప్ నుండి నేరుగా బయటకు వచ్చి - నేరుగా యూట్యూబ్ ఛానెల్ లోనే అవకాశం ఉండేది..

వాట్సాప్ లోనే యూట్యూబ్ వీడియోలను నేరుగా చూడవచ్చు

కానీ, ఇప్పుడు మారిన పరిణామాల దృష్ట్యా వాట్సాప్ వెర్షన్ 2.17.40, ఐఎస్ఓ ద్వారా వాట్సాప్ బయటకు వెళ్లకుండా అందులోనే యూట్యూబ్ వీడియోలు ప్లే అయ్యే విధంగా ఒక ఫీచర్ ని సీక్రెట్ గా అభివృద్ధి చేసింది. కాని ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నందున దాని యెక్క వివరాలను దాచి ఉంచింది..

ఈ బీటా వెర్షన్ ప్రకారం పిక్చర్ - ఇన్ - పిక్చర్ మోడ్ లోనే వీడియోలను చూడవచ్చు. యూజర్ తన స్క్రీన్ ని చిన్నగ లేక పూర్తిగా సైజ్ గా మార్చుకునే విధంగా ఉంటుంది. దీని వల్ల అక్కడ ప్లే అయ్యే వీడియోలను దాచి పెట్టడం ద్వారా, యూజర్లు అక్కడే మెసేజ్ ఛాటింగ్ చేసే సౌకర్యం ఉంది.

మెసేజ్ ఛాటింగ్, ఒక యూజర్ నుండి వేరొక యూజర్ కి మారే క్రమంలో ఈ ఫీచర్ సపోర్టు చెయ్యదనే అనుమానం కూడ ఉంది. ఈ ఫీచర్ ఐఫోన్ 6 మరియు ఆ తరువాత వచ్చే మోడల్స్ మీద మాత్రమే సపోర్టు చేస్తుందని, ఎందుకంటే ముందు చెప్పిన మోడల్స్ కి పెద్ద స్క్రీన్ ఉండటం వల్లే ఇది సపోర్టు చేస్తుందని ఒక రిపోర్టు లో తెలిపారు.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం,

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ వస్తుంద / లేద అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫీచర్ ని మొదట ఐఎస్ఓ లో లాంచ్ చేశాక, అది సక్సెస్ అయితే అప్పడు ఆండ్రాయిడ్ లో తీసుకు వస్తారని సమాచారం..

Read more about:
English summary
The version 2.17.40 of WhatsApp for iOS is reportedly testing in-app YouTube playback support as a hidden feature.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting