కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయ్!
వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా కోసం యూనివర్సల్ ఎమోజీలు
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై పొరపాటున లేదా తొందరపడి పంపిన వాట్సప్ సందేశాలను ఉపసంహరించుకోవచ్చు. పంపిన సందేశాలను తొలగించడం లేదా వీడియో, వాయిస్ కాల్స్ లేదా ఎక్కువ స్టోరేజి కంట్రోల్ ఫీచర్ ద్వారా తొలగించుకునే అవకాశం ఉంది. వాట్సప్ ఆండ్రాయిడ్ డివైస్ల కోసం బీటా ప్రోగ్రామ్ లో అనేక కొత్త ఫీచర్లను పరీక్షించింది.

అత్యంత పాపులర్ ఇన్ స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం ఆండ్రాయిడ్ బీటా కోసం యూనివర్సల్ ఎమోజీ సెట్ను ఆవిష్కరించింది. యూనివర్సల్ ఎమోజీల కొత్త సెట్, ఆపిల్ ఎమోటికాన్లకు ఎంతో సిమిలారిటిస్ను కలిగి ఉంటుంది. ఇది ఎమోజిపిడి ప్రకారం... చిరునవ్వులు చిందించే ముఖాలతో కొత్త సెట్, ఇప్పుడు ఎక్కువగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం లేకుండా కనిపిస్తాయి.
వాట్సప్ యొక్క కొత్త ఎమోజీ రోలింగ్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.17.364 ను సోమవారం ప్రారంభించారు. వాట్సప్ యొక్క బీటా ప్రోగ్రాంలో చేరిన యూజర్లు ఈ యాప్ ఉపయోగించినప్పుడు కొత్త ఎమోజీలను చూడనున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే Emojipediaలో చూడవచ్చు. అయితే ఆపిల్ యొక్క ఎమిటోటికన్స్ కంటే కాస్త డిఫరెంట్గా క్రియేటివిటితో వీటిని రూపొందించారు.
ఫేస్‌బుక్ యాజమాన్యం ఈ సర్వీస్ను, ఎమోజీ ప్యాక్ని ప్రైవేటు బీటా వెర్షన్ తో ఇంకా పరీక్షిస్తోంది. ఈ ఎమోజీలు చివరి వెర్షన్లో రీడిజైన్డ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎలాంటి మేజర్ బగ్స్ లేకుండా టెస్టింగ్ ముగిసినట్లయితే త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. Ios,ఆండ్రాయిడ్ రెండింటిలోనూ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.
అయితే ప్రస్తుతం రోల్అవుట్ లేదా సరైన రిలీజ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎమోజీల కొత్త సెట్ ఈ ఏడాది చివరినాటికి ఆండ్రాయిడ్ డివైస్సుల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








