వాట్సాప్ పుట్టింది ఈ రోజే, మీకు తెలియని నిజాలు

ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌ ఈ రోజు తన 8వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఫిబ్రవరి 24, 2008న ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులైన బ్రెయిన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (అప్పటి భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ 1,18,000 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. వాట్సాప్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

Read More : కలకలం రేపుతోన్న ఐఫోన్ 7 ప్లస్ పేలుడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వాడుతున్నారంటే..?

వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. రోజుకు 5000 కోట్ల మెసేజ్‌లు వాట్సాప్‌లో షేర్ అవుతున్నాయి. రోజుకు 8 కోట్ల GIFమెసేజెస్ వాట్సాప్‌లో షేర్ అవుతున్నాయి.

ఫోటోలు, వీడియోలు విషయానికి వచ్చేసరికి..?

ఇక ఫోటోల విషయానికి వచ్చేసరికి రోజుకు 330 కోట్ల ఫోటోలు వాట్సాప్ ద్వారా షేర్ కాబడుతున్నాయి. ఇక వీడియోల విషయానికి వచ్చేసరికి రోజుకు 76 కోట్ల వీడియోలు వాట్సాప్‌లో షేర్ అవుతున్నాయి.

వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి..?

ఇక వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి రోజుకు 10 కోట్ల వాయిస్ కాల్స్ ను వాట్సాప్‌ ద్వారా నిర్వహించుకుంటున్నారు. ఇండియాలో వాట్సాప్ యూజర్ల సంఖ్య 16 కోట్లుగా ఉంది. వాట్సాప్‌కు అత్యధిక మంది యాక్టివ్ యూజర్లు భారత్‌లోనే ఉండటం.

జాన్‌కౌమ్‌ను తిరస్కరించిన ఫేస్‌బుక్‌

వాట్సాప్ ఫౌండర్ జాన్‌కౌమ్ 2008లో ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం ట్రై చేసాడు. అయితే అతనికి ఉద్యోగం దక్కలేదు.

గూగుల్ కూడా ప్రయత్నాలు చేసింది

వాట్సాప్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ కూడా ప్రయత్నించింది. గూగుల్ ఆఫర్ చేసిన డీల్ విలువ 10 బిలియన్ డాలర్లు. ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను వాట్సాప్ ఎస్ఎంఎస్ వాల్యుమ్ ఎప్పుడో అధిగమించేసింది.

ఉద్యోగుల సంఖ్య 5 మాత్రమే..

వాట్సాప్ మొత్తం ఉద్యోగుల సంఖ్య కేవలం 55 మాత్రమే. వారిలో 34 మంది ఇంజినీర్లు ఉన్నారు.

ఫేస్‌బుక్, వాట్సాప్ డీల్ గురించి...

బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల మేరకు ఫేస్‌బుక్, వాట్సాప్ డీల్ కుదరటానికి రెండు సంవత్సరాల పట్టిందట. ఈ డీల్ కు సంబంధించి తొలసారిగా జూన్ 2012లో మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ సీఈఓ జాన్ కౌమ్ కు ఫోన్ చేసారట. చివరాకరకు వీరిద్దరి మధ్య డీల్ ప్రేమికుల రోజున ఒకే అయ్యిందట.

జాన్ కౌమ్ సిద్ధాంతం ఏంటంటే..?

వాట్సాప్ ఓ రిమైండర్ లాంటిదని అందులో యాడ్స్, గేమ్స్, గిమ్మిక్స్ లాంటివి ఉండకూడదన్నది జాన్ కౌమ్ సిద్ధాంతం. 

జాన్ కౌమ్ కుటుంబ నేపథ్యం..

జాన్ కౌమ్ తన కుటుంబంతో సహా కమ్యూనిస్ట్ ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది. కొద్ది సంవత్సరాల పాటు శాన్‌‌జోన్ స్టేట్ యూనివర్శిటీలో తరగతులకు హాజరైన జాన్ ఆ తరువాత యాహూలో ఉద్యోగం సంపాదించారు.యాహూలో పనిచేస్తున్న సమయంలోనే జాన్‌కౌమ్ ఆక్టన్‌ను కలిసారు. 2009లో యాహూ నుంచి బయటకొచ్చిన వీరిద్దరు వాట్సాప్‌ను ప్రారంభించారు.

సరికొత్త సంచలనం

జాన్ కౌమ్ (37), బ్రెయిర్ ఆక్టమ్(44)లకు 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత జాన్ కౌమ్ తో కలిసి ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Turns 8: Here Are Incredible WhatsApp Facts You Don't Know. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot