రాత్రుళ్ళు నిద్రపోకుండ సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారా?

By Anil
|

ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు చేసే పని స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేయడం.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా ఫీల్ అవుతుంటారు. ఈ సోషల్ మీడియా మాయలో పడి ఎప్పుడు తింటున్నారో ,ఎప్పుడు పడుకుంటున్నారో ,ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియకుండా చాలా మంది జీవితాన్ని గడిపేస్తున్నారు.మరి కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్ లైన్ లోనే ఉంటూ ఏ అర్ద రాత్రుల్లో నిద్రపోతుంటారు.నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేసేవారు చాలా దుష్ఫలితాలు ఎదురుకుంటారని డాక్టర్లు హెచ్చరిస్తున్న వినకుండా చాలా మంది బిజీ బిజీగా ఉంటున్నారు .సోషల్ మీడియాలో రాత్రుళ్ళు నిద్రపోకుండా గడపడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఎదురుకుంటారో ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతున్నాము.

 

సోషల్‌ మీడియాలో బిజీగా  ఉండేవారు:

సోషల్‌ మీడియాలో బిజీగా ఉండేవారు:

రాత్రి నిద్రపోకుండా సోషల్‌ మీడియాలో బిజీగా ఉండేవారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురి అవుతారని ది లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్'లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది.

రోజు చేసే పనుల్లో:

రోజు చేసే పనుల్లో:

అలాంటి వారి రోజు చేసే పనుల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుంది.ఏ పని చేయాలన్న బద్దకిస్తుంటారు. బై పోలార్‌ డిసార్డర్‌ ద్వారా కోపం, బాధ, చిరాకు వంటివి అలాంటి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది.

నరాల వ్యాధులకు కూడా గురికావచ్చు:

నరాల వ్యాధులకు కూడా గురికావచ్చు:

సరైన సమయంలో నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్ తో బిజీగా ఉండేవారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఆనందంగా ఉండలేరు:
 

ఆనందంగా ఉండలేరు:

బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు అస్సల ఆనందంగా ఉండలేరని, అలాంటివారు ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని రిపోర్టు స్పష్టం చేసింది.

 రిపోర్టు ప్రకారం:

రిపోర్టు ప్రకారం:

దాదాపు 91 వేల మంది మధ్య వయసు గల వారి పై పరిశోధన చేసి ఒక రిపోర్టు తయారు చేసింది. వారందరినీ సోషల్‌ మీడియాలో మునిగిపోయేలా చేసి వారి రోజు చేసే పనుల్లో వచ్చిన మార్పులను గుర్తించింది.వారిలో 11 శాతం మంది బై పోలార్‌ డిసార్డర్, 6 శాతం మంది మానసిక ఒత్తిడి, 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం గుర్తించింది.

Best Mobiles in India

English summary
A decade ago, only college kids and geeks hung out on Facebook. Today, social media is as mainstream as Netflix, drawing us in with equal amounts of information and entertainment – through a multitude of digital channels and devices. And we love how it helps us stay in touch with friends and family and current events – not to mention all the procrastination opportunities.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X