ఇక వాట్సాప్‌లో ఎలాంటి ఫైల్‌నైనా షేర్ చేసుకోవచ్చు

వాట్సాప్ యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో 100MB నిడివి గల ఫైల్‌ను షేర్ చేసుకునే అవకాశం...

|

మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లో పరీక్షించి చూసినట్లు సమచారం. WABetaInfo పోస్ట్ చేసిన లేటెస్ట్ కథనం ప్రకారం వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతోన్న కొత్త ఫీచర్ ద్వారా ఎటువంటి ఫైల్‌నైనా మీ వాట్సాప్ కాంటాక్ట్ గ్రూప్‌ల‌లో షేర్ చేసుకునే వీలుంటుందట. వాట్సాప్ ప్రస్తుతానికి Word documents, slides, spreadsheets ఇంకా PDF ఫైల్స్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తోంది.

 

అన్ని రకాల ఫైల్స్ పంపుకోవచ్చు

అన్ని రకాల ఫైల్స్ పంపుకోవచ్చు

కొత్త ఫైల్ సపోర్ట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే csv, doc, docx, pdf, ppt, pptx, rtf, txt, xls, xlsx ఫైల్స్‌ను కూడా వాట్సాప్‌లో షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ సపోర్ట్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో 100MB నిడివి గల ఫైల్‌ను పంపుకునే అవకాశముంటుందట.

వాట్సప్‌లో 1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను పంపడం ఎలా..?

వాట్సప్‌లో 1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను పంపడం ఎలా..?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఏమైనా అర్జంట్ ఫైల్స్ పంపాలంటే ముందుగా అడిగేది మీకు వాట్సప్ ఉందా అని...వాట్సప్ అంతగా భాగమైపోయింది మనజీవితంలో. అయితే వాట్సప్ లో ఫైల్స్ కొంత పరిధి వరకే పంపగలం. మిగతా ఫైల్స్ పంపలేం. అంటే 16 ఎంబి ఉన్న ఫైల్స్ మాత్రమే వాట్సప్ లో ఇతరులకు షేర్ చేయవచ్చు. అయితే అంతకన్నా పెద్ద ఫైల్స్ షేర్ చేయాలంటే ఎలా..ఇందుకోసం మీకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి.

whatstools యాప్‌...
 

whatstools యాప్‌...

ముందుగా గూగుల్ ప్లే స్లోర్‌లో కెళ్లి whatstools యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత దాన్ని ఇన్‌స్టాల్ చేయండి.

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత...

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత...

మీరు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా యాప్ పేజీలో గెట్ స్టార్టడ్ బటన్‌ను సెలెక్ట్ చేసుకోండి. బటన్‌ను సెలక్ట్ చేసుకోగానే టర్న్ ఆన్ బటన్ వస్తుంది. కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ గూగుల్ డ్రైవ్ లోకి సైన్-ఇన్ అవ్వమని అడుగుతుంది.

చాలా సింపుల్‌గా ఎక్కువ జీబి ఫైల్స్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది

చాలా సింపుల్‌గా ఎక్కువ జీబి ఫైల్స్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది

అప్పుడు మీరు గూగుల్ అకౌంట్ Allow అనే ఆప్సన్ మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియోని అయితే పంపాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోండి. దాన్ని మీరు షేర్ బటన్ ద్వారా మీరు వాట్సప్‌లోకే కాకుండా ఇతర సోషల్ మీడియా యాప్‌లోకి పంపుకోవచ్చు. ఇలా చేయటం చాలా సింపుల్‌గా మీరు ఎక్కువ జిబి ఉన్న ఫైళ్లను ఇలా పంపేసుకోవచ్చన్నమాట.

Best Mobiles in India

English summary
You can soon share any type of file via WhatsApp. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X