Home
Tablets

ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. Acer నుంచి లాంచ్ అయిన Acer Iconia Tab iM11 వివరాలు ఇవిగో..!

Acer India New Tab : ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ ఏసర్‌ గురువారం భారత్ మార్కెట్‌ లో Acer Iconia Tab iM11 ట్యాబ్లె్ట్‌ ను విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంది. మరియు క్వాడ్‌ స్టీరియో స్పీకర్లు, 7400mAh బ్యాటరీతోపాటు అనేక మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ వైఫైతోపాటు సెల్యూలర్‌ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. ఈ ఏసర్‌ ట్యాబ్లెట్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఏసర్‌ ట్యా్బ్లెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ట్యాబ్లెట్‌ 60Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11.45 అంగుళాల 2.2k IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 450 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ యాక్టివ్‌ స్టైలస్ పెన్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఏసర్‌ ట్యాబ్లెట్‌ బరువు 550 గ్రాములుగా ఉంది.

Acer Iconia Tab iM11 tablet

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ ట్యా్బ్‌ మీడియాటెక్‌ హీలియో G99 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

16MP ఆటోఫోకస్‌ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 16MP కెమెరాను అమర్చారు. LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 18W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Acer Iconia Tab iM11 tablet

క్వాడ్‌ స్పీకర్‌ సిస్టమ్‌ :
ఈ ఏసర్‌ ట్యాబ్లెట్‌ ప్యూర్‌ వాయిస్‌ టెక్నాలజీ సపోర్టుతో క్వాడ్‌ స్పీకర్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని ఏసర్ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా 4G LTE తోపాటు Wi-Fi ను సపోర్టు చేస్తుంది. మరియు బ్లూటూత్‌ 5.2 ఫీచర్‌ ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌తోపాటు ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది.

Acer ట్యాబ్లెట్‌ ధర, సేల్‌ వివరాలు :
ఏసర్‌ ట్యాబ్లెట్‌ (Acer Iconia Tab iM11 Sale) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 4G LTE తోపాటు వైఫై సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ట్యాబ్‌ కొనుగోలుపై యాక్టివ్‌ స్టైలస్ పెన్‌, స్మార్ట్‌ ఫ్లిప్‌ కవర్‌ ను కూడా పొందవచ్చు.

Acer Iconia Tab iM11 tablet

ఏసర్ Iconia ట్యాబ్‌ iM11 సేల్‌ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఏసర్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు ఏసర్ ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్‌ కేవలం ‌బ్లూ కలర్‌ వేరియంట్‌ లోనే ప్రస్తుతానికి విడుదల అయింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Iconia Tab iM11 tablet with 4G and wifi support now available for sale in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X