Home
Tablets

Acer నుంచి కొత్త ట్యాబ్‌లు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ఏసర్‌ భారతలో రెండు ట్యాబ్‌లను విడుదల చేసింది. Acer One 10, Acer One 8 ఎంట్రీ లెవల్‌ ట్యా్బ్‌లెట్‌లను లాంచ్‌ చేసింది. ధర కూడా రూ.20,000 లోపల ఉండనుంది. ఈ ట్యాబ్‌ల ధర, స్పెసిఫికేషన్లు మీకోసం.

ఏసర్‌ వన్‌ 10, వన్‌ 8 స్పెసిఫికేషన్లు : వన్‌ 10 ట్యాబ్‌ 10.1 అంగుళాల WUXGA ఐపీఎస్‌ ప్యానల్‌తో వస్తుంది. మెరుగైన ఆడియో కోసం ఈ ట్యాబ్లెట్లు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటాయి. మీడియోటెక్‌ MT8768 CPU మరియు ఐఎంజీ పవర్‌VR GE8320 GPUపై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 OSతో వస్తుంది. మరియు 7100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Acer india launched one 10 and one 8 tablets

వన్‌ 10 ట్యాబ్‌ వెనుక వైపు 13MP+ 5MP డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.0, OTG సపోర్టు సహా టైప్‌-C పోర్టును కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఏసర్ వన్‌ 8 : ఈ ట్యాబ్‌ 8.7 అంగుళాల WXGA + IPS స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్‌ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 2MP కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.0, OTG సపోర్టు సహా టైప్‌-C పోర్టును కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఏసర్‌ వన్‌ 10 ట్యాబ్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ మరియు 6GB ర్యామ్‌ + 128 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాబ్‌ ప్రారంభ ధర రూ.17,990గా ఉంది.

ఏసర్‌ వన్‌ 8 ట్యాబ్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB ర్యామ్‌ + 32GB అంతర్గత స్టోరేజీ మరియు 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లను అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్‌ ప్రారంభ ధర రూ.12,990 గా ఉంది. ఈ ట్యాబ్‌లెట్లు గ్రే షేడ్‌ రంగులో లభిస్తాయి. మరియు ఒక సంవత్సరం పాటు వారంటీ వస్తుంది.

ఏసర్‌ వన్‌ 10, వన్‌ 8 ట్యాబ్‌లెట్‌లు.. ఏసర్‌ ఇండియా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే ఏ రోజు నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయో సంస్థ వివరాలు వెల్లడించలేదు. అయితే రూ.20,000 ధర లోపల ట్యాబ్‌లెట్ల కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer india launched one 10 and one 8 tablets under budget price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X