Acer నుంచి రెండు ట్యాబ్లెట్‌లు విడుదల.. అందుబాటు ధరలో సూపర్ డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
ప్రముఖ ల్యాప్‌టాప్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ ఏసర్ భారత్ మార్కెట్‌లో రెండు ట్యాబ్లెట్‌లను లాంచ్ చేసింది. Acer Iconia 8.7 మరియు Acer Iconia 10.36 పేర్లతో విడుదల అయ్యాయి. ఈ రెండు ట్యాబ్లెట్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, మీడియాటెక్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. మరియు రూ.15000 కంటే తక్కువ ధరలో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసర్ ట్యాబ్లెట్‌ల ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఏసర్ ట్యాబ్లె్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు :
ఏసర్ Iconia 8.7 (iM9-12M) ట్యాబ్లెట్ 8.7 అంగుళాల WXGA IPS మల్టీ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1340*800 పిక్సల్స్ రిజల్యూషన్, 400 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ హీలియో P22T SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB LPDDR4 ర్యామ్ మరియు 64GB eMMC స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ట్యాబ్లెట్ 365 గ్రాముల బరువుతో అందుబాటులోకి వచ్చింది.
ఈ ఏసర్ ట్యాబ్లెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. వెనుకవైపు 8MP ప్రైమరీ కెమెరా, ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ మోడల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.

ఏసర్ Iconia 10.36 మోడల్ ట్యాబ్లెట్ (iM10-22) 10.36 అంగుళాల 2K IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 480 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 2000*1200 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ వెనుకవైపు 16MP కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది.
ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది ఈ ప్రాసెసర్ 6GB LPDDR4 ర్యామ్ మరియు 128GB eMMC స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS, 2 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్ పొందనుంది.

ఈ ట్యాబ్లెట్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 10 గంటల వరకు వినియోగించుకోవచ్చని ఏసర్ చెబుతోంది. ఈ ట్యాబ్లెట్ 475 గ్రాములుగా ఉంది. ఈ మోడల్ క్వాడ్ స్టీరియో స్వీకర్‌లను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ ఏసర్ Iconia 8.7 మరియు Iconia 10.36 ట్యా్బ్లెట్‌లు బ్లూటూత్ 5.2, డ్యూయల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్ సిమ్ 4G LTE, OTG, USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులో ఉంది. ఈ రెండు ట్యా్బ్లెట్‌లు సన్నని మరియు ఆకర్షణీయ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
ఏసర్ ట్యాబ్లెట్‌ల ధర, సేల్ వివరాలు
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఏసర్ Iconia 8.7 మోడల్ ట్యాబ్లెట్ ధర రూ.11990 గా ఉంది. అదే Iconia 10.36 మోడల్ ధర రూ.14990 గా ఉంది. అయితే ఈ ప్రారంభ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో సంస్థ వెల్లడించలేదు. Acer india వెబ్‌సైట్ సహా అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








