ట్యాబ్లెట్ కొనాలనుంటున్నారా, అయితే మీ కోసమే ఈ న్యూస్..

Written By:

ఒకప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను అత్యుత్తమ ఆవిష్కరణగా భావించాం. మరికొన్నాళ్లకు ఆ స్థానాన్నిల్యాప్‌టాప్ భర్తీ చేసింది. మరిన్ని టెక్నాలజీ పోకడులు ట్యాబ్లెట్ పీసీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ట్యాబ్లెట్ కంప్యూటర్ ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్ అందుబాటులోకి వచ్చేసరికి ప్రయాణంలోనూ మెయిల్ తదితర కంప్యూటింగ్ లావాదేవీలను చకచకా పూర్తిచేసేస్తున్నాం. చివరికి.. ట్యాబ్లెట్‌ను మొబైల్‌లా కూడా ఉపయోగించుకోగలుగుతున్నాం. మొత్తం మీద ఈ ట్యాబ్లెట్, కంప్యూటింగ్‌ అలానే కమ్యూనికేషన్ అవసరాలను మరింత సులభతరంగా తీర్చేస్తోంది. అందుకే కాబోలు ట్యాబ్లెట్ పీసీలకు అంతలా డిమాండ్ ఏర్పడింది. అన్నివర్గాలు కంప్యూటింగ్ యూజర్‌లకు అనువుగా మారిన ట్యాబ్లెట్ పీసీలు భవిష్యత్‌లో మరింత ఆధునీకతతో పాటు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఇందులో భాగంగా త్వరలో రిలీజైన ట్యాబ్లెట్ల వివరాలను మీకందిస్తున్నాం ఓ లుక్కేసుకోండి.

ఇండియాకి మరో 2 రోజుల్లో Xiaomi Mi TV 4A, ధర ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆల్కాటెల్ 1టి 7

అల్కాటెల్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ '1టి7' ను త్వరలో విడుదల చేయనుంది. రూ.5,570 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు లభ్యం కానుంది.
అల్కాటెల్ 1టి 7 ఫీఛర్లు...
7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 4.2, 2580 ఎంఏహెచ్ బ్యాటరీ.

అల్కాటెల్ 1టి10

అల్కాటెల్ '1టి 10'ను త్వరలో విడుదల చేయనుంది. ధర రూ.7,955 ( అంచనా )
అల్కాటెల్ 1టి10 ఫీచర్లు
10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హువాయి మీడియా ప్యాడ్ ఎం5 (8 ఇంచెస్)

హువాయి మీడియా ప్యాడ్ ఎం5 (8 ఇంచెస్) ఫీచర్లు
ధర రూ. రూ.27వేలు, వచ్చే నెల నుంచి అందుబాటులోకి..
8.4 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

హువాయి మీడియా ప్యాడ్ ఎం5 (10 ఇంచెస్)

హువాయి మీడియా ప్యాడ్ ఎం5 (10 ఇంచెస్) ఫీచర్లు
ధర రూ. రూ.31వేలు, వచ్చే నెల నుంచి అందుబాటులోకి..
10.8 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అల్కాటెల్ ఎ3 10 వైఫై

అల్కాటెల్ ఎ3 10 వైఫై ఫీచర్లు
ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో దీని ధర రూ.6,999
10.1 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వైఫై, బ్లూటూత్ 4.2, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alcatel 1T 10, Alcatel 1T 7 With Kids Mode and Android 8.1 Oreo Launched at MWC 2018 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot