వాయిస్ కాల్స్ సౌకర్యంతో రూ.9999కే ఆండ్రాయిడ్ 4జీ టాబ్లెట్

|

Alcatel బ్రాండ్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ 4జీ టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. Alcatel A3 10 పేరుతో విడుదలైన ఈ టాబ్లెట్ ధర రూ.9,999. ఎల్టీఈ అలానే వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే విధంగా డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ద్వారా వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు.

వాయిస్ కాల్స్ సౌకర్యంతో రూ.9999కే ఆండ్రాయిడ్ 4జీ టాబ్లెట్

 

డివైస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 10.1 ఇంచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ 8735B సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

వాయిస్ కాల్స్ సౌకర్యంతో రూ.9999కే ఆండ్రాయిడ్ 4జీ టాబ్లెట్

4600mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్డ్ సపోర్ట్, సింగిల్ సిమ్ , వై-ఫై, బ్లుటూత్ 4.2, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. టాబ్లెట్ బరువు 465 గ్రాములు, చుట్టుకొలత 260x 155 x 8.95 మిల్లీ మీటర్లు. వాల్కనో బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే దొరికే ఈ టాబ్లెట్‌ను Flipkart ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Alcatel A3 10 Tablet With a 10.1-inch Display, Android Nougat, and 4G LTE Launched at Rs.9,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X