Home
Tablets

ఆపిల్‌ ఐప్యాడ్‌ జెన్‌ 10 ధర భారీగా తగ్గింపు.. 10.9 అంగుళాల మల్టీ టచ్‌ డిస్‌ప్లే సహా కీలక ఫీచర్లు..!!

ఆపిల్‌ సంస్థ మే 7న నిర్వహించిన Let Loose ఈవెంట్‌లో ఐప్యాడ్‌ ఎయిర్ 2024, ఐప్యాడ్‌ ప్రో M4 OLED, పెన్సిల్‌ ప్రో, మ్యాజిక్‌ కీ బోర్డును ఆవిష్కరించింది. నిన్నటి నుంచే కొత్త ఐప్యాడ్‌ల ముందస్తు బుకింగ్‌లు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. మే 15 నుంచి కొనుగోలు చేయవచ్చు.

తాజాగా ఐప్యాడ్‌ జెన్‌ 10 (iPad 10 Gen Price Drop) ధర భారీగా తగ్గింది. విడుదల సమయంలో 64GB స్టోరేజీ వైఫై వేరియంట్‌ ధర రూ.39,990 గా ఉంది. ప్రస్తుతం ఈ ఐప్యాడ్‌ను రూ.34,900 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆపిల్‌ టాబ్లెట్‌ శక్తివంతమైన చిప్‌సెట్‌ మరియు బ్యాటరీని కలిగి ఉంటుంది.

ipad 10 gen attracts with massive discount in india

ఐప్యాడ్‌ జెన్‌ 10 స్పెసిఫికేషన్లు :
ఐప్యాడ్‌ జెన్‌ 10.9 అంగుళాల మల్టీ టచ్‌ IPS LED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2360*1640 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 264 ppi పిక్సల్‌ డెన్సిటీ, 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐప్యాడ్‌.. ఆపిల్‌ పెన్సిల్‌ జెన్‌ 1 ను సపోర్టు చేస్తుంది.

ఐప్యాడ్‌ జెన్‌ 10.. iPadOS 17 పైన పనిచేస్తుంది. మరియు హెక్సాకోర్‌ A14 బయోనిక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఆపిల్‌ టాబ్లెట్‌ 28.6 watt hour లిథియం పాలిమర్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా 10 గంటలపాటు వెబ్‌ బ్రౌజింగ్ చేయవచ్చు లేదా వైఫై ద్వారా వీడియోలను వీక్షించవచ్చు. దీంతోపాటు USB-C పోర్టును కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఐప్యాడ్‌ జెన్‌ 10 వెనుకవైపు 5X డిజిటల్‌ జూమ్‌ సామర్థ్యం కలిగిన 12MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 60fps తో 4k వీడియో రికార్డింగ్ ఈ కెమెరా సొంతం. దీంతోపాటు 122 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూ కలిగిన 12MP కెమెరాను కలిగి ఉంటుంది.

**మే 7వ తేదీన నిర్వహించిన Let Loose ఈవెంట్‌లో ఐప్యాడ్‌ ఎయిర్‌ 2024 తోపాటు ఆపిల్‌ ఐప్యాడ్‌ ప్రో OLED కూడా విడుదల అయింది. ఐప్యాడ్‌ ప్రో 2024 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 11 అంగుళాల మరియు 13 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడళ్లు అల్ట్రా రెటీనా Tandem OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది.

డిజైన్‌ పరంగా ఐప్యాడ్‌ ప్రో OLED మోడళ్లు iPadOS 17 పైన పనిచేస్తాయి. 5mm అల్యూమినియం డిజైన్‌తో లాంచ్‌ అయింది. మరియు 3nm M4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. న్యూట్రల్ ఇంజిన్‌ ద్వారా AI ఫీచర్లను సపోర్టు చేస్తుంది. గరిష్ఠంగా 2TB వరకు సపోర్టు చేస్తాయి. అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఐప్యాడ్ ప్రో 12MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. అడాప్టిల్‌ సెన్సార్‌ మరియు LiDAR సెన్సార్‌ను కలిగి ఉంది. ముందువైపు 12MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ నాలుగు స్పీకర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైపై 6E మరియు బ్లూటూత్‌ 5.3 తో లాంచ్ అయింది.

More from GizBot

Best Mobiles in India

English summary
apple ipad 10 gen gets huge discount in india here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X