Home
Tablets

ఆపిల్‌ ipad Mini సేల్.. A17 ప్రో చిప్‌సెట్‌, ఆపిల్‌ ఇంటెలిజెన్స్ సహా కీలక ఫీచర్‌లు.. పూర్తి వివరాలు..!

ఆపిల్ నుంచి ఇటీవల ఐప్యాడ్ మిని విడుదల అయింది. ఈ కొత్త ఐప్యాడ్ A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఆపిల్‌ ఐప్యాడ్‌ మిని భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు (Apple iPad Mini Sale in india) అందుబాటులో ఉంది. ఈ ఐప్యాడ్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. నాలుగు రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ శక్తివంతైన చిప్‌సెట్‌ కారణంగా వేగవంతమైన పనితీరు సహా మెరుగైన గ్రాఫిక్స్‌ సామర్థ్యాలను కలిగి ఉంది.

ఐప్యాడ్‌ మిని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఐప్యాడ్‌ మిని సన్నని, రీడిజైన్‌ లుక్‌, పోర్టబుల్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే గత మోడళ్లతో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఫ్లాట్‌ సైడ్స్‌తో ఆకర్షణీయ డిజైన్‌తో విడుదల అయింది. మరియు ఈ ఆపిల్‌ ఐప్యా్డ్‌ మిని 8.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది.

ipad mini 2024 sale

A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. :
ఈ ఐప్యాడ్‌ శక్తివంతమైన A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫలితంగా గత మోడళ్లతో పోలిస్తే అధిక వేగంతో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ను ఐఫోన్‌ 15 ప్రో మోడళ్లలో వినియోగించారు. ఈ ఐప్యాడ్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు ఆపిల్‌ పెన్సిల్‌ ప్రోను సపోర్టు చేస్తుంది.

సిరి అప్‌గ్రేడ్‌ :
ఐప్యాడ్ మిని ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు iPadOS 18 అప్‌డేట్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ప్రూఫ్‌ రీడింగ్‌, రీరైటింగ్‌, మెయిల్‌, నోట్స్‌ కోసం సులభతరమైన టెక్స్ట్‌ ను అందిస్తుంది. దీంతోపాటు Siri ని కూడా మెరుగుపరిచింది. దీంతోపాటు ఫోటో ఎడిటింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

12MP + 12MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా కొత్త ఆపిల్‌ ఐప్యాడ్‌ వెనుకవైపు 12MP కెమెరా మరియు ముందువైపు 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం ప్రత్యేక ఫీచర్‌ను అమర్చారు. సెంటర్‌ స్టేజ్‌ ఫీచర్‌ ద్వారా వీడియో కాల్‌ సమయంలో ఫ్రేమ్‌ మధ్యలో ఉండేలా ఈ ఫీచర్‌ ఆటోమేటిక్‌ గా పనిచేస్తుంది.

ఐప్యాడ్‌ మిని ధర వివరాలు :
ఆపిల్‌ ఐప్యాడ్‌ మిని భారత్‌ మార్కెట్‌లో 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేసేందుకు లభిస్తుంది. వైఫై వేరియంట్ ప్రారంభ ధర రూ.49,900 గా ఉంది. అదే Wi-Fi + సెల్యూలర్‌ మోడల్‌ ప్రారంభ ధర రూ.64,900 గా ఉంది. ఐప్యాడ్‌ 2024 బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple ipad mini 2024 sale is live in india price sale and features full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X