Home
Tablets

Apple iPad Pro 2025 : ఐప్యాడ్ ప్రో 2025 విడుదల.. M5 చిప్‌సెట్, అల్ట్రా రెటీనా XDR డిస్‌ప్లే సహా..!

Apple iPad Pro 2025 : ఆపిల్‌ తాజాగా M5 చిప్‌సెట్‌ తో మ్యాక్‌బుక్‌ ప్రో, ఐప్యాడ్‌ ప్రో మోడల్స్‌ను విడుదల చేసింది. మరియు M5 చిప్‌తో విజన్‌ ప్రో మోడల్‌ను ఆవిష్కరించింది. ఆపిల్‌ ఐప్యాడ్ ప్రో M5 మోడల్‌ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఏకంగా నాలుగు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ముందస్తు ఆర్డర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, సేల్‌ వివరాలు.

ఐప్యాడ్‌ ప్రో 2025 పూర్తి వివరాలు :
ఆపిల్ ఐప్యాడ్‌ ప్రో 2025 మోడల్‌ అల్ట్రా రెటీనా XDR OLED ప్రో మోషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, ట్రూ టోన్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే అడాప్టివ్‌ Sync ను సపోర్టు చేస్తుంది.

Apple iPad Pro with M5 Chip launched in india

ఐప్యాడ్‌ ప్రో మోడల్‌ M5 చిప్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 10 కోర్‌ GPU, 16 కోర్ Neural Engine ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB ర్యామ్‌, 2TB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఐప్యాడ్‌ ప్రో M5 మోడల్‌ 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఐప్యాడ్‌ ప్రో M5 మోడల్‌ వెనుక వైపు f1/8 అపేచర్‌, 5x డిజిటల్‌ జూమ్‌తో కూడిన 12MP కెమెరాను కలిగి ఉంది. 60fps తో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందు వైపు f/2.0 అపేచర్‌తో 12MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరాతో 60fps 1080p రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఐప్యాడ్‌ ప్రో 2025 మోడల్‌ 11 అంగుళాల వేరియంట్ 31.29Wh బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని చెబుతోంది. 70W USB-C పవర్‌ అడాప్టర్‌ ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఐప్యాడ్‌ ప్రో 2025 మోడల్‌ బ్లూటూత్‌ 6, వైఫై 7 ను కలిగి ఉంది.

ఐప్యాడ్‌ ప్రో 2025 ధర, సేల్‌ వివరాలు :
ఐప్యాడ్‌ ప్రో 2025 (Wi-Fi) 11 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.99,900, (Wi-Fi + సెల్యూలర్) వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. 13 అంగుళాల Wi-Fi వేరియంట్ ధర రూ.1,29,900 గా ఉంది. Wi-Fi + సెల్యూలర్‌ వేరియంట్‌ ధర రూ.1,49,900 గా ఉంది.

ఆపిల్ ఐప్యాడ్‌ ప్రో 2025 మోడల్‌ ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అక్టోబర్‌ 22 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఆపిల్‌ వెబ్‌సైట్‌, రిటైల్‌ స్టోర్‌, ఇతర స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఐప్యాడ్‌ స్పేస్‌ బ్లాక్, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ప్రో M5 :
ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ప్రో M5 చిప్‌సెట్‌ తో అందుబాటులోకి వచ్చింది. macOS Tahoe (macOS 26) పైన పనిచేస్తుంది. ఆపిల్‌ ఇంటిలెజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 72.4W బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 12MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాలను కలిగి ఉంది. ప్రారంభ ధర రూ.1,69,900 గా ఉంది.

Images : Apple.com

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPad Pro with M5 Chip launched in india, specifications, price and pre orders open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X