యాపిల్ కొత్త వ్యూహం, రూ.24000కే కొత్త ఐప్యాడ్!

|

ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించబోతోన్న యాపిల్, అమ్మకాల పరంగా మాత్రం స్థిరమైన గ్రాఫ్‌ను మెయింటేన్ చేయలేక పోతోంది. ఈ సంస్థకు ఎక్కువ రాబడిని తెచ్చిపెడితోన్న ఐఫోన్‌లు కూడా మార్కెట్‌ను ఆకట్టుకోవటంలో విఫలమవుతున్నాయి. ఇక ఐప్యాడ్‌ల విషయానికి వచ్చేసరికి గత కొద్ది సంవత్సరాలుగా వీటి సేల్ కూడా క్షీణిస్తూనే ఉంది.

 
యాపిల్ కొత్త వ్యూహం, రూ.24000కే కొత్త ఐప్యాడ్!

గతం ఎలా ఉన్నప్పటికి, ఈ ఏడాది మాత్రం యాపిల్‌కు స్వల్ప ఊరటనిచ్చేదిగా నిలిచింది. కొద్ది నెలల క్రితం లాంచ్ చేసిన కొత్త ఐప్యాడ్ లైనప్ అమ్మకాల పరంగా దూసుకువెళుతుండటంతో ఇదే ట్రెండ్‌ను కొనసాగించాలని యాపిల్ భావిస్తోంది.

ఐప్యాడ్‌లకు మరింత డిమాండ్‌ను సృష్టించే క్రమంలో వీటిని బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందించేందుకు యాపిల్ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. 2018లో లాంచ్ చేయబోతోన్న 9.7 ఇంచ్ ఐప్యాడ్ మోడల్‌ను రూ.25,000లోపే విక్రయించాలని యాపిల్ భావిస్తున్నట్లు సమాచారం.

డిగీటైమ్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం.. వచ్చే ఏడాది యాపిల్ లాంచ్ చేయబోతోన్న నూతన వర్షన్ ఐప్యాడ్ ప్రస్తుతం మోడల్‌తో పోలిస్తే $70 (రూ.4500) తగ్గింపుతో లభ్యం కానుంది. ప్రస్తుత ఐప్యాడ్ వర్షన్ ధర $329 (రూ.28,900)గా ఉంటే వచ్చే ఏడాది లాంచ్ అయ్యే ఐప్యాడ్ మోడల్ ధర $259 (రూ.24,000)గా ఉంటుందన్న మాట. ఈ రిపోర్ట్ వాస్తవరూపం దాల్చినట్లయితే ఐప్యాడ్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

శాంసంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్, హైలెట్ ఫీచర్లతో..శాంసంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్, హైలెట్ ఫీచర్లతో..

యాపిల్ సంస్థ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన 9.7 ఇంచ్ ఐప్యాడ్ రెండు వేరియంట్ (వై-ఫై, వై-ఫై + సెల్యులార్) వేరియంట్‌లలో లభ్యమవుతోంది. వై-ఫై వేరియంట్ ధర రూ.28,900, వై-ఫై + సెల్యులార్ వేరియంట్ ధర రూ.39,900.

9.7 ఇంచ్ ఐప్యాడ్ మోడల్ డిజైనింగ్ పరంగా ఐప్యాడ్ ఎయిర్ 2కు దగ్గర పోలికులను కలిగి ఉంటంది. బరువు 490 గ్రాములు. 64-బిట్ ఏ9 చిప్‌సెట్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు ఎం9 మోషన్ కో-ప్రాసెసర్‌తో పాటు 2జీబి ర్యామ్ పెయిర్ అయి ఉంటుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఐప్యాడ్ లభ్యమవుతోంది. వీటిలో మొదటి వేరియంట్‌ను 32జీబి స్టోరేజ్‌తో, రెండవ వేరియంట్‌ను 128జీబి స్టోరేజ్‌తో సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Apple is rumored to be all set to launch a low-cost 9.7-inch iPad priced around Rs. 25,000 in India in 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X