4జీబి ర్యామ్‌తో Asus టాబ్లెట్

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Asus, విప్లవాత్మక ఫీచర్లతో కూడిన శక్తివంతమైన టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. Zenpad 3S 10 పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ కాబడిన ఈ డివైస్‌లో 9.7 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి.

Read More : గూగుల్ ఆఫర్, ఒకరు కొంటే ఫ్యామిలీ మొత్తానికి ఉచితం!

4జీబి ర్యామ్‌తో Asus టాబ్లెట్

సిల్వర్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ టాబ్లెట్ ధర 341 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.23,000). తైవాన్ మార్కెట్లో ఆగస్టు నుంచి ఈ డివైస్ లభ్యమవుతుంది. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. Zenpad 3S 10 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

Read More : రిలయన్స్ జియో 4జీ SIMను పొందటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే..

9.7 అంగుళాల QXGA లామినేటెడ్ డిస్‌ప్లేతో జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 వస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 2048 x 1536పిక్సల్స్. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్ సౌలభ్యత.

హార్డ్‌వేర్...

జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 టాబ్లెట్ మీడియాటెక్ ఎంటీ8179 ప్రాసెసర్‌తో వస్తోంది.

స్టోరేజ్...

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 టాబ్లెట్ 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా...

కెమెరా విషయానికి వచ్చేసరికి జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 టాబ్లెట్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ప్రంట్ పేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఈ కెమెరాల ద్వారా 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్‌ను ఆస్వాదించవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం ఇంకా కనెక్టువిటీ...

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 రన్ అవుతుంది. వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్ - సీ, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

బ్యాటరీ...

జెన్‌ప్యాడ్ 3ఎస్ 10 శక్తివంతమైన 5900 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus Zenpad 3s 10 Tablet with 4GB RAM Announced: 6 Features You Should Know. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot