టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. రూ.10 వేలలోపే మీ కోసం కొన్ని బెస్ట్ ఆప్షన్స్!
Budget tablets: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే టాబ్లెట్‌లు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. చాలామంది వీటిని ముఖ్యంగా ప్రొడక్టివిటీ కోసం ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, నిపుణులు టాబ్లెట్లను ఎక్కువగా వాడుతున్నారు. వినోదం, విద్య, పని.. ఇలా అన్ని అవసరాల కోసం టాబ్లెట్‌లు ఉపయోగపడుతున్నాయి. మీ బడ్జెట్ రూ.10,000 లోపు ఉన్నా, మంచి ఫీచర్లతో టాబ్లెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని టాబ్లెట్లు ఈ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం
* రెడ్‌మీ ప్యాడ్ SE
రెడ్‌మీ ప్యాడ్ SE మంచి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇది 8.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 1340 x 800 రిజల్యూషన్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌లో ఫాస్ట్‌గా పని చేస్తుంది. 3GB RAM + 32GB స్టోరేజీ ఆఫర్ చేశారు. ఎక్స్‌టర్నల్ మెమోరీని 512GB వరకు పెంచుకోవచ్చు.

6650mAh బ్యాటరీ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు, వీడియో కాల్స్, డాక్యుమెంట్ స్కానింగ్ కోసం ఇందులో 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 14, HyperOSపై నడుస్తుంది. విద్యార్థులతో పాటు మల్టీమీడియా పనులు, తేలికపాటి గేమింగ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్. స్టీరియో స్పీకర్లూ ఉన్నాయి.
* హానర్ ప్యాడ్ X8
హానర్ ప్యాడ్ X8 టాబ్లెట్, 10.1 అంగుళాల పూర్తి HD IPS LCD స్క్రీన్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే చాలా స్పష్టంగా ఉండటంతో వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి చాలా బాగుంటుంది. మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3GB RAM ఉండటం వల్ల, ఇది వేగంగా పనిచేస్తుంది. 32GB స్టోరేజీతో పాటు, 512GB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీనిలో 5100mAh బ్యాటరీ ఉంది, ఇది రోజంతా బ్యాకప్ ఆఫర్ చేస్తుంది. ఫొటోలు, వీడియో కాల్స్ కోసం 5MP వెనుక కెమెరా, 2MP ముందు కెమెరా ఉన్నాయి. ఇది Android 12 ఆధారిత మ్యాజిక్ UI 4 తో పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, చిన్న చిన్న గేమ్స్ ఆడటానికి ఉత్తమంగా నిలుస్తుంది.
* లెనోవో M9 ట్యాబ్
లెనోవో M9 ట్యాబ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లుగా ఉంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం ఇది చాలా బాగుంటుంది. 9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తున్న ఈ టాబ్లెట్ చదవడానికి, వీడియోలు చూడటానికి చాలా స్పష్టంగా ఉంటుంది. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్, 3GB RAM ఉండటం వల్ల ఇది స్పీడ్‌గా పనిచేస్తుంది.
32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌ని 1TB వరకు పెంచుకునే అవకాశముంది. 5100mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్‌తో వస్తుంది. వీడియో కాల్స్, డాక్యుమెంట్ స్కానింగ్ కోసం 8MP బ్యాక్-కెమెరా, 2MP ఫ్రంట్-కెమెరా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత లెనోవో UI తో వస్తుంది. కాంపాక్ట్ డిజైన్ ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
- ఐటెల్ ప్యాడ్ వన్
ఐటెల్ ప్యాడ్ వన్ బడ్జెట్ ధరలో మంచి టాబ్లెట్ కోసం చూసేవారికి బెస్ట్ ఆప్షన్. ఇది బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియోలు చూడటం వంటి వాటికి చాలా బాగుంటుంది. 10.1 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (256GB వరకు పెంచుకోవచ్చు) ఉన్నాయి. 6000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5MP వెనుక కెమెరా, 8MP ముందు కెమెరా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో వస్తుంది. సన్నగా, తేలికగా ఉండటం వల్ల దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
* ఏది బెస్ట్
స్మూత్ పర్ఫామెన్స్ కోసం రెడ్‌మీ ప్యాడ్ SE బెస్ట్ ఆప్షన్. బెస్ట్ డిస్‌ప్లే కోసం హానర్ ప్యాడ్ X8 మంచి ఎంపిక. విద్యార్థులు, ఆన్‌లైన్ క్లాసుల కోసం లెనోవో M9 ట్యాబ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. చిన్నపాటి పనులు, మీడియా కోసం ఐటల్ ప్యాడ్ వన్ మంచి ఎంపిక.
ఈ టాబ్లెట్‌లన్నీ రూ.10,000 లోపు ధరలో లభిస్తాయి. అవసరాలను బట్టి, బడ్జెట్‌ను బట్టి ఏది కావాలో ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు వివిధ చోట్ల వీటి ధరలను పోల్చి చూసి తక్కువ ధరకే ఇచ్చే ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయాలి.


Click it and Unblock the Notifications








