Home
Tablets

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024.. ఈ ఆపిల్ ఐప్యాడ్‌పై భారీ డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 (Flipkart Big Billion Days Sale 2024) సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లకు 26వ తేదీ నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. అయితే ఎన్నిరోజులపాటు సేల్‌ నిర్వహించనున్నారనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన కొన్ని డిస్కౌంట్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఐప్యాడ్‌ 9th జెన్‌ను (Apple iPad 9th Gen) భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో రానుంది.

మెటల్‌ డిజైన్‌, ప్రీమియం లుక్‌ :
ఆపిల్‌ ఐప్యాడ్‌ 9 జెన్‌ 2021 లో విడుదల అయింది. త్వరలో ప్రారంభ కానున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో 64GB వైఫై వేరియంట్‌ను సుమారుగా రూ.18,500 కు కొనుగోలు చేయవచ్చు. అయితే కచ్చితమైన ధర వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఈ ఐప్యాడ్‌ మెటల్‌ డిజైన్‌, ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. మరియు iOS 18 అప్‌డేట్‌ పొందనుంది.

apple ipad 9th Gen

ఐప్యాడ్‌ స్పెసిఫికేషన్‌లు :
ఐప్యాడ్‌ 9 జెన్‌ 10.2 అంగుళాల 2K రిజల్యూషన్‌ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు A13 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. iPad0S 15 ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 12MP అల్ట్రావైడ్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. బ్లూటూత్‌ 5.0 పైన పనిచేస్తుంది. USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

ఈ ఐప్యాడ్‌ 9 జెన్‌ ఫేస్ ఐడీ, యాస్సెలిరోమీటర్‌, గైరో, ప్రాక్సిమిటీ బారోమీటర్‌ సెన్సార్‌లను కలిగి ఉంది. ఆన్‌లైన్‌ తరగతులు సహా ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరాల కోసమైతే ఈ ఐప్యాడ్‌ను కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ఐప్యాడ్‌ ధర రూ.25,000 గా ఉంది. త్వరలో కచ్చితమైన ధర వివరాలు వెల్లడి కానున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో డిస్కౌంట్‌ ధరలకే కొనుగోలు చేయవచ్చు. మరియు UPI ద్వారా రూ.50 తగ్గింపును పొందవచ్చు. నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష వరకు క్రెడిట్‌ సదుపాయం పొందవచ్చు.

మరో ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ కూడా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌ను నిర్వహించనుంది. అయితే కచ్చితమైన తేదీలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్‌ నెలాఖరు లేదా అక్టోబర్‌ తొలివారంలో సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని డీల్‌ వివరాలు వెల్లడయ్యాయి.

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌లో భాగంగా SBI డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో మొబైల్‌, విడిభాగాలపై 40 శాతం, ట్యాబ్లెట్‌లపై 60 శాతం, స్మార్ట్‌టీవీ, ప్రొజెక్టర్‌లపై 60 శాతం, హెడ్‌ఫోన్‌లు, గేమింగ్‌ పరికరాలు సహా ఇతర ఉత్పత్తులపై 70 శాతం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చని అమెజాన్ తెలిపింది. విమాన టికెట్లు, రైలు, బస్సు టికెట్లు, హోటల్‌ బుకింగ్‌లపైనా డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Billion days sale 2024 offers best Price discount on apple ipad 9th Gen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X