MWC 2025 హానర్ ప్యాడ్ V9, వాచ్ 5 అల్ట్రా విడుదల.. ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు!
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 లో హానర్ కీలక ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో హానర్ ప్యాడ్ V9, హానర్ వాచ్ 5 అల్ట్రా ఉన్నాయి. ఈ ప్యాడ్ గత సంవత్సరంలోనే చైనాలో లాంచ్ అయింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు హానర్ వాచ్ 5 అల్ట్రా కూడా ఆవిష్కరించారు. ఈ వాచ్ అనేక హెల్త్. ఫిట్‌నెస్ ట్రాకర్‌లను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. 40 మీటర్ల నీటిలోనూ డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది.
హానర్ ప్యాడ్ V9 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ప్యాడ్ (Honor Pad V9) 144Hz రీఫ్రెష్ రేట్‌తో 11.5 అంగుళాల (2800*1840 పిక్సల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్, 274 PPI పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR Vivid ను సపోర్టు చేస్తుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ ట్యాబ్లెట్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ తరహా టాస్క్‌ల కోసం Mail G615 GPU ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వరకు జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 ను కలిగి ఉంది.
భారీ బ్యాటరీ, కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆటోఫోకస్ సామర్థ్యంతో 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ప్రైమరీ కెమెరా ద్వారా 4K రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ధర వివరాలు :
ఈ హానర్ ప్యాడ్ V9 యూరప్, UK వంటి మార్కెట్స్‌తో EUR 449.90 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.40,000) గా ఉంది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్‌లోకి అందుబాటులోకి రానుంది.
హానర్ వాచ్ 5 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌వాచ్ 60Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5 అంగుళాల (466*466 పిక్సల్స్) LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Sapphire గ్లాస్ రక్షణను పొందుతుంది. మరియు Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. 480mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 15 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది.
హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్లు :
ఈ వాచ్ (Honor Watch 5 Ultra) అనేక హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. SpO2, స్లీప్, హార్ట్ రేట్, ECG ట్రాకింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రత్యేక యాప్ ద్వారా ఆరోగ్యం సహా ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఫలితంగా అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
ఈ వాచ్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 40 మీటర్ల లోతు నీటిలోనూ స్మార్ట్‌వాచ్ డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది. అయితే భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాచ్ ధర వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఎన్ని వేరియంట్స్‌లో లాంచ్ కానుందనే సమాచారం తెలియలేదు.


Click it and Unblock the Notifications








