Home
Tablets

హానర్‌ ప్యాడ్‌ 9 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం.. రూ.2500 డిస్కౌంట్, బ్లూటూత్‌ కీబోర్డు ఉచితం..!

హానర్‌ త్వరలో మార్కెట్‌లోకి కొత్త ట్యాబ్లెట్‌ Pad 9 ను (Honor Pad 9) విడుదల చేయనుంది. అధికారిక విడుదల కంటే ముందే ఈ ప్యాడ్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఈ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. హానర్‌ ప్యాడ్‌ 9 సేల్ మార్చి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

హానర్‌ ప్యాడ్‌ 9 ముందస్తు బుకింగ్‌తో (Honor Pad 9 Pre Booking) రూ.2,500 వరకు డిస్కౌంట్‌ సహా హానర్‌ బ్లూటూత్‌ కీబోర్డ్‌ ను ఉచితంగా పొందవచ్చని తెలుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ హానర్‌ ప్యాడ్‌ 9 ధర రూ.22,499 గా ఉంది.

Honor Pad 9 pre orders open in india news

హానర్ ప్యాడ్‌ 9.. 12.1 అంగుళాల 2.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్ మరియు 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.

ఈ హానర్‌ ప్యాడ్‌ 9 MagicOS 7.2 పైన పనిచేస్తుంది. మరియు 8300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం 8 స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు బై డైరెక్షనల్‌ వాయిస్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తుంది.

ఇవాళ్టి నుంచి మార్చి 27 వరకు హానర్‌ ప్యాడ్‌ 9 ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి రూ.2500 డిస్కౌంట్‌తో కలిపి రూ.22,499 కే సొంతం చేసుకోవచ్చు. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 2 వరకు తొలి దశ సేల్ ప్రారంభం అవుతుంది.

ఈ హానర్‌ ప్యాడ్‌ 9 6.96mm మందం (Thickness) మరియు 555g గ్రాముల బరువు ఉంటుంది. ఈ ప్యాడ్‌ మెటాలిక్‌ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు ఈ ప్యాడ్‌ స్టైలిష్‌ లుక్‌తో వచ్చింది. అయితే ఈ ట్యాబ్లెట్‌ మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. హనర్‌ ఇండియా ఇటీవల X9b స్మార్ట్‌ఫోన్ సహా హానర్‌ ఛాయిస్ ఇయర్‌బడ్స్‌ X5 ను విడుదల చేసింది.

హానర్‌ x9b స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2652*1200 రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ స్క్రీన్ అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

హానర్‌ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హానర్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. ఫోన్‌ మేజిక్ టెక్ట్స్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్‌ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు.

ఈ హానర్‌ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని హానర్‌ చెబుతోంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor Pad 9 pre order open in india via amazon here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X