హానర్ ప్యాడ్ 9 సేల్ ప్రారంభం.. ప్రారంభ ఆఫర్ కింద రూ.2000 తగ్గింపు మరియు బ్లూటూత్ కీబోర్డు ఉచితం..!
హానర్ ప్యాడ్ 9 (Honor Pad 9 sale) ఇటీవల భారత్‌లో విడుదల అయింది. ఈ ప్యాడ్ 2560*1600 పిక్సల్ రిజల్యూషన్ IPS డిస్‌ప్లే మరియు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ మరియు 8300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ తో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.
ప్రారంభ ఆఫర్ కింద రూ.2000 తగ్గింపు.. :
ఈ హానర్ ప్యాడ్ 9 ఇవాళ్టి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్ సాధారణ ధర రూ.24,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.22,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు హానర్ బ్లూటూత్ కీబోర్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్చి 22 న ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి.

హానర్ ప్యాడ్ 9.. 12.1 అంగుళాల 2.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించవచ్చు.
35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 8300mAh బ్యాటరీ :
ఈ హానర్ ప్యాడ్ 9 ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. మరియు 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 8300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం 8 స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు బై డైరెక్షనల్ వాయిస్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తుంది.
555 గ్రాముల బరువు మాత్రమే :
ఈ హానర్ ప్యాడ్ 9 6.96mm మందం (Thickness) మరియు 555 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ప్యాడ్ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు ఈ ప్యాడ్ స్టైలిష్ లుక్‌తో వచ్చింది. కనెక్టివిటీ పరంగా USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు వైఫై, బ్లూటూత్ V5.1 ను సపోర్టు చేస్తుంది.
** హనర్ ఇండియా ఇటీవల X9b స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. హానర్ x9b స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2652*1200 రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.
హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హానర్ కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. ఫోన్ మేజిక్ టెక్ట్స్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు.
ఈ హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని హానర్ చెబుతోంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








