Home
Tablets

చిన్నారుల కోసం ధర రూ.10,999 కే ట్యాబ్లెట్‌ విడుదల.. 11 అంగుళాల డిస్‌ప్లే, 8500mAh బ్యాటరీ సహా..!

హానర్‌ నుంచి తాజాగా ట్యా్బ్లెట్‌ విడుదల అయింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ట్యాబ్లెట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హానర్‌ ప్యాడ్ X8s నాదల్‌ కిడ్స్‌ ఎడిషన్‌ రూ.13,999 (Honor Pad X8s Nadal Kids Edition) పేరుతో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో తీసుకొచ్చింది. సిలికాన్‌ కేస్‌, షాక్‌ప్రూఫ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హానర్‌ ట్యాబ్లెట్‌ Eye కంఫర్ట్‌ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా బ్లూ లైట్‌ నుంచి చిన్నారుల కంటిని సురక్షితంగా ఉంచుతుంది.

హానర్‌ ప్యాడ్‌ X8s నాదల్‌ కిడ్స్‌ ఎడిషన్‌ ఫీచర్‌లు :
హానర్‌ చిల్డ్రన్‌ ఎడిషన్‌ 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1290*1200 పిక్సల్స్ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో విడుదల కానుంది. ఈ ట్యాబ్లెట్‌ను ఆక్టా కోర్‌ క్వాల్‌కామ్‌ స్నా్ప్‌డ్రాగన్‌ 680 చిప్‌సెట్‌ పై పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 14 MagicOS 8.0 ను కలిగి ఉంది.

Honor Pad X8 Nadal Kids Edition launched in india at rs10999 including bank offers

హానర్‌ ప్యాడ్‌ X8s నాదల్‌ కిడ్స్‌ ఎడిషన్‌ 64GB, 128GB స్టోరేజీ వేరియంట్‌ల అందుబాటులో ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 5MP ప్రధాన కెమెరాతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కోసం ముందస్తుగా సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి.

ఈ ట్యాబ్లెట్‌ యాంటీ షాక్‌ మరియు హ్యాండిల్‌, స్కెచ్‌, వీడియో మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌ గూగుల్‌ కిడ్స్‌ స్పేస్‌ ఫీచర్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటుంది. మరియు Doodle Pen ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హానర్ ట్యాబ్లెట్‌ 8300mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

హానర్‌ ప్యాడ్ X8s నాదల్‌ కిడ్స్‌ ఎడిషన్‌ ధర వివరాలు ;
హానర్‌ ప్యాడ్ X8s నాదల్‌ కిడ్స్‌ ఎడిషన్‌ ట్యాబ్లెట్‌ను భారత్‌ మార్కెట్‌లో రూ.13,999 కే కొనుగోలు చేయవచ్చు. లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ చిల్డ్రన్‌ వెర్షన్‌ ట్యాబ్లెట్‌ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.

* భారత్‌ మార్కెట్‌లో ఇటీవలే హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ప్రస్తుతం హానర్‌ వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత MagicOS 8.0 OS ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) f/1.75 అపేచర్‌తో 108MP కెమెరా, f/2.2 అపేచర్‌తో 5MP అల్ట్రా వైడ్‌ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.15999 కే సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor Pad X8s Nadal Kids Edition launched with 11 inch display in india features sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X