11.5 అంగుళాల డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ హానర్ నుంచి తాజాగా ట్యాబ్లెట్ లాంచ్ అయింది. ఈ ట్యాబ్లెట్ అనేక మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. హానర్ ప్యాడ్ X9a పేరుతో (Honor Pad X9a Tablet) విడుదల చేసింది. వైఫై వేరియంట్ గా అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ హానర్ ట్యాబ్లెట్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌ల వివరాలు.
హానర్ ప్యాడ్ X9a ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు :
డిజైన్ పరంగా ఈ ప్యా్డ్ ఆకట్టుకుంటోంది. గ్రే కలర్ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ హానర్ ప్యాడ్ X9a ట్యాబ్లెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 11.5 అంగుళాల 2.5K ( 1504*2508 పిక్సల్స్ ) LCD డిస్‌ప్లేతో లాంచ్ అయింది.

ప్రాసెసర్, OS వివరాలు :
హానర్ ప్యాడ్ ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జత చేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్‌లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఫలితంగా 8GB వరకు వర్చువర్ ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది. ఈ హానర్ ప్యాడ్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లోనే ప్రస్తుతం అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ ఎన్ని సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుందో తెలియాల్సి ఉంది.

బ్యాటరీ :
ఈ ట్యాబ్లెట్ 35W ఛార్జింగ్ సపోర్టుతో 8300mAh Li-ion బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 70 రోజుల పాటు స్టాండ్‌బై మోడ్‌లో ఉంటుందని తెలిపింది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం క్వాడ్ స్పీకర్ యూనిట్‌ను అమర్చారు.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా హానర్ ట్యాబ్లెట్ f/2.0 అపేచర్, ఆటోఫోకస్ ఫీచర్‌తో 8MP కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు f/2.2 అపేచర్‌తో 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హానర్ ట్యాబ్లెట్ వైఫై, బ్లూటూత్ 5.1, వైర్‌లైస్ కీబోర్డ్, Stylus ను సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ బరువు 475 గ్రాములుగా ఉంది.
స్టోరేజీ వివరాలు :
హానర్ ప్రస్తుతం ఈ కొత్త ట్యాబ్లెట్‌ను మలేషియాలో మాత్రమే లాంచ్ చేసింది. హానర్ మలేషియా వెబ్‌సైట్‌లో ఇప్పటికే లిస్టింగ్‌లో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ స్టోరేజీతో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. అయితే ఈ ట్యాబ్లెట్ ధర వివరాలు వెల్లడి కాలేదు.
భారత్‌లో ఈ ట్యాబ్లెట్ విడుదలపై హానర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఇప్పటి వరకు ఎలాంటి లీక్స్ కూడా రాలేదు. త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిజైన్ సహా చిప్‌సెట్ పరంగా ఈ ట్యాబ్లెట్ బడ్జెట్ రేంజ్ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








