యాపిల్‌కు షాకిచ్చిన ఇండియన్ కంపెనీ టాబ్లెట్!

యాపిల్, ఆసుస్, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్‌లకు షాకిస్తూ ఇండియన్ కంపెనీ ఐబాల్ సరికొత్త 4జీ టాబ్లెట్ ను మార్కెట్లోకి తీసుకవచ్చింది.

యాపిల్‌కు షాకిచ్చిన ఇండియన్ కంపెనీ టాబ్లెట్!

iBall Slide Brace-X1 పేరుతో లాంచ్ అయిన ఈ టాబ్లెట్ ధర రూ.17,499. టాప్ క్లాస్ స్పెసిఫికేషన్‌లతో ఆకట్టుకుంటోన్న ఈ టాబ్లెట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read More : ఊరిస్తోన్న సామ్‌సంగ్ 4జీ ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ కిక్ స్టాండ్‌

ప్రత్యేకమైన మెటల్ కిక్ స్టాండ్‌తో వస్తోన్నఈ టాబ్లెట్‌ను టేబుల్ పై డెస్క్‌టాప్ మాదిరిగా నిలిపి ఉంచొచ్చు. ఈ స్టాండ్‌కు ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేకమై స్పీకర్లు క్లియర్ సౌండ్‌ను ఆఫర్ చేస్తాయి. ప్రీమియమ్ క్వాలిటీ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది.

 

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, మాలీటీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

బ్యాటరీ..

శక్తివంతమైన 7800 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఈ టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు. సింగిల్ ఛార్జ్ పై 24 గంటల బ్యాకప్‌ను ఈ బ్యాటరీ ఆఫర్ చేయగలదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఇంకా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు. ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఈ 4జీ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

కనెక్టువిటీ ఫీచర్లు

4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో వస్తోన్న ఈ టాబ్లెట్ రిలయన్స్ జియో సేవలను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కాలింగ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపరిచారు.

21 ప్రాంతీయ భాషల సపోర్ట్

10.1 ఇంచ్ మల్టీ టచ్ ఐపీఎస్ డిస్‌ప్లేతో (రిసల్యూషన్1280x 800పిక్సల్స్) వస్తోన్న ఈ టాబ్లెట్ 21 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

ప్రీలోడెడ్ యాప్స్..

మైక్రోసాఫ్ట్ వర్డ్, Excel, పవర్ పాయింట్ వంటి యాప్‌లను ముందస్తుగా ఈ డివైస్‌లో ప్రీలోడ్ చేసారు. Facebook, Saavn, WhatsApp వంటి యుటిలిటీ యాప్స్ కూడా ఈ టాబ్‌లో ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iBall Slide Brace-X1 4G Tablet launched: 5 Features to look out for. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot