Home
Tablets

ధర రూ.10999 కే 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ ట్యాబ్లెట్‌ విడుదల.. సేల్ వివరాలు..!

ఇన్ఫినిక్స్‌ నుంచి తొలి ట్యాబ్లెట్‌ Infinix XPAD భారత్‌లో (Infinix XPAD Launched) విడుదల అయింది. ఈ ట్యాబ్లెట్‌ ఆకట్టుకొనే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ మెటల్‌ డిజైన్ సహా ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే సహా 7000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. సెప్టెంబర్‌ 26 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ ట్యాబ్లెట్‌ను మరింత డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్‌ Xpad ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ XPAD 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 440 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఈ ట్యాబ్లెట్‌ మెటల్‌ Unibody డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్‌ ట్యాబ్లెట్‌ 7.58mm థిక్‌నెస్‌తో 496 గ్రాముల బరువు ఉంటుంది.

Infinix XPAD launched in india

ఈ ఇన్ఫినిక్స్‌ XPAD మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4x ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS OS పైన పనిచేస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ XPAD 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. క్వాడ్‌ స్టీరియో స్పీకర్లతో DTS ఆడియోను కలిగి ఉంటుంది. ChatGPT తో కూడిన Folax వాయిస్‌ అసిస్టెంట్‌తో లాంచ్‌ అయింది.

ఇన్ఫినిక్స్‌ XPAD ట్యాబ్లెట్‌ 4GB ర్యామ్ వేరియంట్ రూ.10,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ రూ.13999 గా ఉంది. టైటాన్‌ గోల్డ్‌, స్టీలర్‌ గ్రే, ఫ్రాస్ట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సెప్టెంబర్‌ 26 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ట్యాబ్లెట్‌ను రూ.9899 కే కొనుగోలు చేయవచ్చు.

ఇటీవలే ఇన్ఫినిక్స్‌ నుంచి హాట్‌ 50 5G హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 Soc చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 OS తో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో మరో AI కెమెరాను అమర్చారు. వెనుకవైపు డ్యూయల్‌ LED ఫ్లాష్‌ లైట్‌ సహా ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్‌ 50 5G హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. వైబ్రంట్‌ బ్లూ, స్లీక్‌ బ్లాక్‌, సేజ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. భద్రత పరంగా సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 4G, 5G, GPS, బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్‌ Wi-Fi ఫీచర్లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix XPAD launched in india with 11 inch FHD+ display and 7000mAh Battery full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X