Home
Tablets

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు, A17 ప్రో చిప్‌సెట్‌తో iPad Mini.. స్పెసిఫికేషన్‌లు, ధర, సేల్‌ వివరాలు!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్ ఐప్యాడ్‌ మిని ని (Apple iPad Mini Launched) భారత్‌లో విడుదల చేసింది. ఈ ఐప్యాడ్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐప్యాడ్‌ మిని A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐప్యాడ్ మిని.. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. పోర్టబుల్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది. గత మోడళ్ల కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.

ఆపిల్‌ ఐప్యాడ్‌ మిని స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్‌ ఐప్యాడ్‌ మిని 8.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త ఐప్యాడ్‌ A17 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ను ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌లో వినియోగించారు. ఐప్యాడ్‌ గత మోడళ్లతో పోలిస్తే డబుల్‌ వేగంతో పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ఆపిల్‌ పెన్సిల్‌ ప్రోను సపోర్టు చేస్తుంది.

iPad Mini Launched

ఐప్యాడ్‌ మిని డిజైన్‌ పరంగా (Apple iPad Mini specs) ఆకర్షణీయంగా ఉంది. ఫ్లాట్‌ సైడ్స్‌తో అందుబాటులో ఉంది. ఐప్యాడ్‌ ప్రో, ఐప్యాడ్‌ ఎయిర్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. పోర్టబుల్‌ గా ఉంది. గత మోడళ్లతో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు (iPad Mini Cameras) 12MP వైడ్‌ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 12MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా సెంటర్‌ స్టేజ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. వీడియో కాల్స్‌ సమయంలో ఫ్రేమ్‌ మధ్యలో ఉండేలా ఈ ఫీచర్‌ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

iPad Mini Launched

ఐప్యాడ్‌ మిని ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. అక్టోబర్ 23 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఐప్యాడ్‌ మిని 128GB, 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ మిని (W-Fi) వేరియంట్ ధర రూ.49,900 గా ఉంది. అదే వైఫై+ సెల్యూలర్‌ మోడల్‌ ధర రూ.64,900 గా ఉంది. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను అందించనుంది. ఐప్యాడ్‌ మిని బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

* ఆపిల్‌ నుంచి త్వరలో మరిన్ని ఉత్పత్తులు విడుదల కానున్నాయి. అందుబాటులో ప్రధానంగా ఐఫోన్‌ SE 4 కూడా లాంచ్‌ కానుంది. ఇటీవలే ఈ ఐఫోన్‌ కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. కొన్ని లీక్‌ల ఆధారంగా ఐఫోన్‌ SE 4 మోడల్‌ 2025 మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

iPad Mini Launched

ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఆపిల్‌ ఇంటెలిజెన్స్, యాక్షన్‌ బటన్‌, ఫేస్‌ ఐడీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బ్లూమ్‌బర్క్‌ మార్క్‌ గుర్మన్‌ లీక్స్‌ ఆధారంగా ఐఫోన్ SE 4 మోడల్‌ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గత మోడల్ కేవలం 4.7 అంగుళాల డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంది.

దీంతోపాటు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా 48MP కెమెరాను కలిగి ఉంటుంది. యాక్షన్‌ బటన్‌ సహా 8GB ర్యామ్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ఆధారంగా ఐఫోన్‌ SE 4 ధర సుమారు రూ.49,900 గా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPad Mini Launched with Apple intelligence features and A17 pro Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X