iQOO కొత్త టాబ్లెట్ iQOO ప్యాడ్ ! లాంచ్,స్పెసిఫికేషన్ల వివరాలు
iQOO తన మొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్ iQOO ప్యాడ్‌ని మే 23న చైనీస్ మార్కెట్‌లలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ టాబ్లెట్ లాంచ్ iQOO Neo 8 స్మార్ట్‌ఫోన్ తో పాటు లాంచ్ జరుగుతుంది. ఇపుడు, ఈ లాంచ్‌కు ముందు, ప్రాసెసర్, డిస్‌ప్లే మరియు మరిన్ని వివరాలతో సహా ట్యాబ్ యొక్క స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ వివరాలు నిశితంగా పరిశీలిద్దాం.
iQOO ప్యాడ్ టాబ్లెట్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
IQOO ప్యాడ్ టాబ్లెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌తో వస్తుందని కంపెనీ ఇప్పుడు ధృవీకరించింది. ఈ ప్రాసెసర్, డైమెన్సిటీ 9000+ iQOO యొక్క ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్. ఇది 1 + 3 + 4 కోర్ కాన్ఫిగరేషన్‌తో కూడిన ఆక్టా-కోర్ CPUలో ప్యాక్ చేయబడుతుంది. ఈ ప్రాసెసర్ కార్టెక్స్-X2 కోర్ (3.2GHz వద్ద క్లాక్ చేయబడింది) మరియు మూడు కార్టెక్స్ A710 కోర్లను (ఒక్కొక్కటి 2.85GHz వద్ద క్లాక్ చేయబడింది) కలిగి ఉంది.

ఈ ప్రాసెసర్ అదనంగా Mali G710 MC10 GPUతో వస్తుంది. iQOO ప్యాడ్ 4442 చదరపు mm హీట్ డిస్సిపేషన్ ప్రాంతాన్ని కూడా కలిగి ఉంటుంది. టాబ్లెట్‌లో LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి.
ఈ బ్రాండ్ విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ టాబ్లెట్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 12.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించింది. ఈ డిస్‌ప్లే 2.8K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది, 600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు HDR10 సపోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 1.07 బిలియన్ కలర్ లకు సపోర్ట్ చేస్తుంది.
iQOO ప్యాడ్ టాబ్లెట్ రంగు మరియు డిజైన్ వివరాలు
ఈ టాబ్లెట్ దాని అధికారిక లాంచ్ కి ముందు చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో గుర్తించబడింది, దీని ద్వారా ఈ టాబ్లెట్ యొక్క డిజైన్ మరియు రంగుల గురించి కొన్ని వివరాలను ధృవీకరించింది. ఈ టాబ్లెట్ బూడిద రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల కోసం ఆప్షన్లు ఉంటాయి. ఈ టాబ్లెట్ 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB మరియు 12GB + 512GB కాన్ఫిగరేషన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఈ టాబ్లెట్ డిజైన్ వివరాలు గమనిస్తే, iQOO ట్యాబ్ వక్ర మూలలతో చదును కలిగిన చివరలతో డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని వెనుకవైపు ఉన్న ఒక వృత్తాకార మాడ్యూల్ ట్యాబ్ యొక్క డ్యూయల్ కెమెరా సెటప్ మరియు LED ఫ్లాష్‌ను హోస్ట్ చేస్తుంది. ముందు వైపు కెమెరా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఉంచబడుతుంది.
ఈ టాబ్లెట్ 10000mAh బ్యాటరీ యూనిట్ తో ప్యాక్ చేయబడే అవకాశం ఉంది, ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే, ఇది ఆండ్రాయిడ్ 13 OS తో పనిచేస్తుంది.ఇంకా, iQoo కంపెనీ iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను మే 23న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే.


Click it and Unblock the Notifications








