Home
Tablets

Lenovo నుంచి మిడ్‌రేంజ్‌ ధరలో ట్యాబ్లెట్‌.. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో విడుదల..!

లెనోవో సంస్థ భారత్ మా‌ర్కెట్‌ లో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ ను ( Lenovo idea Tab Plus Tablet ) విడుదల అయింది. మిడ్‌ రేంజ్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్లెట్‌ 5G సపోర్టుతో లాంచ్‌ అయింది. మీడియాటెక్‌ చిప్‌సెట్‌, భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. సంవత్సరం వరకు వారంటీని అందిస్తుంది. ఈ ట్యాబ్లెట్ వైఫై, సెల్యూలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.

లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు :
లెనోవో ట్యాబ్లెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 12.1 అంగుళాల IPS 2.5K IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ మెటల్‌ బాడీని కలిగి ఉంది. అయితే కేవలం 6.29mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది.

Lenovo idea tab plus tablet

లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీను సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. రెండు OS అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరాను అమర్చి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ ట్యాబ్లెట్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,200mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. రోజువారీ అవసరాల సహా ఇతర టాస్క్‌ల కోసం అనుకూలంగా ఉంటుంది.

డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో :
లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ ట్యాబ్లెట్. ఏఐ నోట్స్‌ (AI Notes), సర్కిల్‌ టు సెర్చ్‌ (Circle to Search) వంటి ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ ట్యాబ్‌ పెన్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నోట్స్, స్కెచ్‌ వంటి సమయాల్లో అనుకూలంగా ఉంటుందని లెనోవో చెబుతోంది. ఈ ట్యాబ్లెట్‌ డాల్బీ అట్మాస్ సపోర్టుతో 4 స్పీకర్‌ లను కలిగి ఉంది.

లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ (వైఫై + సెల్యూలర్‌) ధర రూ.27999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ (Wi-Fi) ధర రూ.27999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ (సెల్యూలర్‌ + వైఫై) ధర రూ.30999 గా ఉంది.

కలర్‌ వేరియంట్స్ :
ఈ లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్లస్‌ ట్యాబ్లెట్‌ లూనా గ్రే, క్లౌడ్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. సంవత్సరం వరకు వారంటీని అందిస్తోంది. త్వరలో సేల్‌ వివరాలు వెల్లడి కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo idea tab plus tablet launched in india with mediatek dimensity 6400 chip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X