Home
Tablets

Lenovo ఐడియా ట్యాబ్‌ ప్రో ట్యాబ్లెట్‌ విడుదల.. 12.7 అంగుళాల డిస్‌ప్లే, 10200mAh బ్యాటరీ..!

లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్రో ట్యాబ్లెట్‌ను (Lenovo Idea Tab Pro) లాంచ్‌ చేసింది. ఈ ట్యాబ్లెట్‌ అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు భారీ బ్యాటరీని కలిగి ఉంది. లైట్‌ గేమింగ్‌ సహా ఇతర టాస్క్‌లను సులభంగా పూర్తి చేసేలే శక్తవంతమైన చిప్‌సెట్‌ను అమర్చారు. దీంతోపాటు డిజైన్‌ పరంగానూ ఈ ట్యాబ్లెట్ ఆకట్టుకుంటుంది. 3K రిజల్యూషన్‌తో మెరుగైన డిస్‌ప్లేను కలిగి ఉంది.

లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ట్యాబ్లెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 12.7 అంగుళాల LTPS LCD (2944*1840 పిక్సల్స్‌) తో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 273 PPI పిక్సల్‌ డెన్సిటీ ను కలిగి ఉంది.

Lenovo idea Tab pro launched

ఈ లెనోవో ట్యాబ్లెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ZUI 16 పైన పనిచేస్తోంది. మరియు ఆక్టాకోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ 12GB ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మరియు సర్కిల్‌ టూ సెర్చ్‌, జెమిని AI అసిస్టెంట్‌ వంటి AI చాట్‌బాట్‌ జెమిని ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ లెనోవో ట్యాబ్లెట్‌ 10200mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 11 గంటల వీడియో ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చు. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3, వైఫై 6E, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో కూడిన JBL స్పీకర్‌లను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా లెనోవో ఐడియా ట్యాబ్‌ ప్రో వెనుక వైపు 13MP ఆటోఫోకస్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చారు. వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 615 గ్రాముల బరువును కలిగి ఉంది.

దీంతోపాటు ఈ ట్యాబ్లెట్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. లెనోవో స్మార్ట్‌ కనెక్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇతర డివై‌జ్‌లతో ఫైల్స్ షేర్‌ చేసేందుకు షేర్‌ హబ్‌, యాప్‌ స్ట్రీమింగ్‌, స్మార్ట్‌ క్లిప్‌బోర్డ్‌ వంటి ఫీచర్‌లున్నాయి. ఈ ట్యాబ్లెట్‌ లెనోవో ట్యాబ్‌ పెన్‌ ప్లస్ స్టైలస్‌ను కలిగి ఉంది. మరియు కీబోర్డ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

లెనోవో ట్యాబ్లెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ను లెనోవో ఇండియా వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. మార్చి 21 వ తేదీ నుంచి అమెజాన్‌ లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo idea Tab pro launched with 10200mAh Battery and Mediatek dimensity 8300 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X