తక్కువ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నారా.. 11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్ విడుదల!
Lenovo Idea Tab : ప్రముఖ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ సంస్థ లావా భారత్ మార్కెట్‌లో లెనోవో ఐడియా ట్యాబ్‌ను (Lenovo Idea Tab) విడుదల చేసింది. వైఫై వేరియంట్‌తోపాటు 5G వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది. లావా నుంచి ఇటీవలే ఐడియా ట్యాబ్ ప్రో అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్తగా లాంచ్ అయిన ట్యాబ్లెట్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉందని లెనోవో చెబుతోంది.
లెనోవో ఐడియా ట్యాబ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లెనోవో ఐడియా ట్యాబ్ 11 అంగుళాల 2.5K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ TUV Rheinland ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్, OS వివరాలు :
లెనోవో ట్యాబ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని లెనోవో చెబుతోంది. ఈ లెనోవో ట్యాబ్లెట్ వైఫై (Wi-Fi Only), 5G వంటి రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఈ లెనోవో ఐడియా ట్యాబ్ కీ బోర్డు, ట్యాబ్ పెన్ లేదా ట్యాబ్ పెన్ ప్లస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ లెనోవో ట్యాబ్లెట్ టర్బో సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. దీని ద్వారా 19 శాతం మెరుగైన పనితీరు సొంతమవుతుందని చెబుతోంది. ఫలితంగా రోజువారీ టాస్క్‌లతోపాటు ఇతర పనులను సౌకర్యంగా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
7040mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ట్యాబ్లెట్ వెనుక వైపు 8MP కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP ఫిక్సడ్ ఫోకస్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ 20W ఛార్జింగ్ సపోర్టుతో 7040mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ లూనా గ్రే కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

నాలుగు స్పీకర్లు :
ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో 4 స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్, లెనోవో AI నోట్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
వేరియంట్స్ ఆధారంగా 5G, 4G LTE, వైఫై 802.11 ac ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లూటూత్ 5.2, GPS, USB -C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ లెనోవో ట్యాబ్ పెన్, లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్, Folio కీ బోర్డును కలిగి ఉంది.
లెనోవో ఐడియా ట్యాబ్ ధర, సేల్ వివరాలు :
లెనోవో ఐడియా ట్యాబ్ వైఫై + పెన్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. అదే 5G + పెన్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ప్రస్తుతం ఈ లెనోవో ఐడియా ప్యాడ్ ను లెనోవో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ సహా లెనోవో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








