Home
Tablets

8.8 అంగుళాల డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్లెట్.. ముందస్తు బుకింగ్‌ తేదీ వెల్లడి..!

లెనోవో నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌ లోకి ట్యాబ్లెట్‌ అందుబాటులోకి రానుంది. Lenovo Legion Tablet పేరుతో లాంచ్‌ కానుంది. ఈ ట్యాబ్లెట్‌ను ఈ సంవత్సరం మార్చి నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం యూరోప్‌, మధ్య ఆసియా దేశాలు, ఆఫ్రికాలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ట్యాబ్లెట్‌ ఫోటోలు కనిపించాయి. దీని ద్వారా ట్యాబ్లెట్‌ డిజైన్ సహా కీలక ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. లెనోవో లీజియన్ ట్యాబ్లెట్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో జులై 20 నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మొబైల్‌ యాప్‌లో ప్రమోషనల్ బ్యానర్‌ను గుర్తించవచ్చు.

లెనోవో లీజియన్‌ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌ లు :
ఈ లెనోవో ట్యాబ్లెట్‌ 8.8 అంగుళాల QHD+ 2.5k డిస్‌ప్లే ను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో లాంచ్‌ కానుంది. దీంతోపాటు ఈ ట్లాబ్లెట్‌ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 8+ జెన్‌ SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది.

lenovo legion tablet pro orders to start from july 20 in india via Flipkart

లెనోవో లీజియన్‌ ట్యాబ్లెట్‌ గ్లోబల్‌ వెర్షన్ తరహాలోనే భారత్‌ వెర్షన్‌ కూడా ఉండనుందని ఫ్లిప్‌ కార్ట్ ప్రమోషనల్ బ్యానర్‌ ఆధారంగా తెలిసింది. దీంతోపాటు ఈ ట్యాబ్లెట్ కోల్డ్‌ ప్రాంట్‌ వేపర్‌ థర్మల్‌ సొల్యుషన్‌.. బీస్ట్‌ మోడ్‌, బ్యాలెన్సడ్‌ మోడ్‌, ఎనర్జీ సేవింగ్‌ మోడ్‌ లను కలిగి ఉంటుంది.

లెనోవో లీజియన్ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు :
లెనోవో లీజియన్‌ ట్యాబ్లెట్‌ గ్లోబల్‌ వెర్షన్‌ కెమెరా విభాగం వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 13MP ప్రధాన కెమెరా సహా 2MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. మరియు ఈ ట్యాబ్లెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో కలిగి ఉంది.

ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉన్న ఈ లెనోవో లీజియన్‌ ట్యాబ్లెట్ 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర EUR 599 ( భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.53,500 ) గా ఉంది. జులై 20 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3, వైఫై 6E, USB-C 2.0 ఛార్జింగ్ పోర్టు, USB-C 3.1 పోర్టును కలిగి ఉంది. అయితే భారత్‌ వేరియంట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు పైన తెలిపిన కొన్ని ఫీచర్లపై సంస్థ ప్రకటన చేయల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
lenovo legion tablet launch confirmed in india and pro order date announced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X