Home
Tablets

Lenovo నుంచి కొత్త ట్యా‌బ్‌... 11 అంగుళాల డిస్‌ప్లే, 7040mAh.. ధర, సేల్ పూర్తి వివరాలు..!

లెనోవో సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ ను విడుదల చేసింది. లెనోవో ట్యాబ్‌ K11 పేరుతో లాంచ్‌ చేసింది. అయితే ఈ ట్యాబ్‌ కేవలం ఒకే రంగులోనే అందుబాటులో ఉంది. అదే లూనా గ్రే కలర్‌ వేరియంట్. ఈ కొత్త ట్యాబ్‌ లెనోవా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుంది.

లెనోవా ట్యాబ్‌ K11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లెనోవా ట్యాబ్‌ K11 (Lenovo Tab K11).. 11 అంగుళాల WUAGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1920*1200 పిక్సల్‌ రిజల్యూషన్‌తో లాంచ్‌ అయింది. 1080p స్ట్రీమింగ్‌ను సపోర్టు చేసింది. వీడియో కాల్‌ సమయంలోనూ ఉత్తమ అనుభవాన్ని అందిస్తుంది.

Lenovo Tab K11 launched in india

2028 జనవరి వరకు సెక్యూరిటీ అప్‌ డేట్లు :
ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ లెనోవో ట్యాబ్‌ K11 మీడియా టెక్‌ హీలియో G88 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. రెండు OS అప్‌ గ్రేడ్‌లు, 2028 జనవరి వరకు సెక్యూరిటీ అప్‌డేట్ల ను పొందవచ్చని లెనోవో తెలిపింది.

7040mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ లెనోవో ట్యాబ్‌ K11 7040mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌ ద్వారా 10 గంటలపాటు నిరంతరాయంగా వీడియో ప్లేబ్యాక్‌ ను పొందవచ్చని లెనోవో సంస్థ చెబుతోంది. ఈ ట్యాబ్‌ ధర రూ.17,990 గా ఉంది. లెనోవో అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Lenovo Tab K11 launched in india

లెనోవో ట్యాబ్‌ K11.. లెనోవో ట్యాబ్‌ పెన్‌ ప్లస్‌ సపోర్టు చేస్తుంది. చేతిరాతను టెక్ట్స్‌ గా మార్చే Nebo ను కలిగి ఉంటుంది. దీంతోపాటు Myscript క్యాలిక్యులేటర్‌ మరియు డాక్యుమెంట్‌, నోట్‌ తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ ట్యాబ్‌ ఇతర లెనోవో ల్యాప్‌ టాప్‌, PC లతో సులభంగా కనెక్ట్‌ అయ్యేందుకు ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ ను కలిగి ఉంటుంది.

465 గ్రాముల బరువు :
దీంతోపాటు ఈ లెనోవో ట్యాబ్‌ K11.. ఆండ్రాయిడ్ జీరో టచ్‌ డాక్యుమెంటేషన్‌, కమర్షియల్‌ కస్టమైజేషన్‌ సిస్టమ్‌, కమర్షియల్‌ సాఫ్ట్‌ వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ లెనోవో ట్యాబ్‌ 465 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. 7.15 mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు IP52 రేటింగ్‌ తో వాటర్‌ మరియు డస్ట్‌ రెసిస్టెంట్‌ గా విడుదల అయింది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lenovo Tab K11 with 11 inch display and 7040mAh battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X